Share News

ముంబై అవుట్‌

ABN , Publish Date - May 09 , 2024 | 05:06 AM

లఖ్‌నవూపై హైదరాబాద్‌ విజయంతో..ఈసారి ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ రేస్‌నుంచి అవుటైన తొలిజట్టుగా ఐదుసార్లు చాంపియన్‌ ముంబై నిలిచింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో..

ముంబై అవుట్‌

లఖ్‌నవూపై హైదరాబాద్‌ విజయంతో..ఈసారి ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ రేస్‌నుంచి అవుటైన తొలిజట్టుగా ఐదుసార్లు చాంపియన్‌ ముంబై నిలిచింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్‌ (14) మూడో స్థానానికి ఎగబాకింది. ఇక కోల్‌కతా, రాజస్థాన్‌ చెరో 16 పాయుంట్లతో మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు ఈనెల 14న లఖ్‌నవూ-ఢిల్లీ జట్లు పరస్పరం తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో ఒకదానికి 12 పాయింట్లు మించి లభించనున్నాయి. కాగా..12 మ్యాచ్‌లు ఆడిన ముంబై నాలుగు విజయాలు సాధించింది. మొత్తం ఎనిమిది పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న ఆ జట్టు...రెండింటిలో నెగ్గినా గరిష్ఠంగా 12 పాయింట్లే లభిస్తాయి. అందువల్ల ముంబై టాప్‌-4లో నిలిచే అవకాశాలు ఏమాత్రం లేవు.

Updated Date - May 09 , 2024 | 05:06 AM