Share News

Neeraj Chopra: వాచ్ గురించే చర్చ..!!

ABN , Publish Date - Aug 12 , 2024 | 05:18 PM

ఎట్టకేలకు ఒలింపిక్స్ ముగిశాయి. సీజన్‌లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా అద్భుతంగా రాణించాడు. గాయం వల్ల స్వర్ణ పతకం జస్ట్ మిస్ అయ్యింది. ఇప్పుడు నీరజ్ ధరించిన వాచ్ గురించి తెగ చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆ గడియారం సాదా సీదాది కాదు. వాచ్ ధర రూ.లక్షల్లో ఉండటంతో ఒక్కటే డిస్కషన్.

Neeraj Chopra:  వాచ్ గురించే చర్చ..!!
Neeraj Chopra Watch

ఎట్టకేలకు ఒలింపిక్స్ (Olympics 2024) ముగిశాయి. సీజన్‌లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా అద్భుతంగా రాణించాడు. గాయం వల్ల స్వర్ణ పతకం జస్ట్ మిస్ అయ్యింది. ఇప్పుడు నీరజ్ ధరించిన వాచ్ గురించి తెగ చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆ గడియారం సాదా సీదాది కాదు. వాచ్ ధర రూ.లక్షల్లో ఉండటంతో ఒక్కటే డిస్కషన్.


neeraj.jpg


వాచ్ మీద దృష్టి..

ఫైనల్ పోరులో నీరజ్ చోప్రా ఇబ్బంది పడ్డారు. గాయం వల్ల సరిగా ఆడలేదు. ఐదు ఫౌల్స్ కావడం ఇందుకు నిదర్శనం. రెండోసారి విసిరిన ఈటె 89.45 మీటర్ల వద్ద ఆగడంతో సిల్వర్ మెడల్ దక్కింది. ఈటె విసిరే సమయంలో నీరజ్ ఎడమ చేతికి ఉన్న వాచ్ మీద అందరి దృష్టి పడింది. ఆ వాచ్ కంపెనీ పేరు ఒమెగా. సీమాస్టర్ అక్వా టెర్రా కలెక్షన్స్‌లో ఆల్ట్రా లైట్ మోడల్ వాచ్‌ను నీరజ్ ధరించాడు. ఆ వాచ్ ధర ఎంత ఉంటుందని చూస్తే నెటిజన్లు ఒకింతా షాక్‌నకు గురవుతున్నారు. ఎందుకంటే వాచ్ ధర అక్షరలా రూ.52 లక్షల 13 వేల 200గా ఉంది.


watcj.jpg


రూ.52 లక్షలు

నీరజ్ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. వాచ్ ధర గురించి సెర్చ్ చేసి యూజర్లు ఖంగుతిన్నారు. ఇక కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘ఆ వాచ్ ధర తెలుసుకునేందుకు ప్రయత్నించా. ఒమెగా అక్వా టెర్రాకు చెందినదని గుర్తించా. ధర రూ.52 లక్షలుగా ఉంది అని’ ఓ నెటిజన్ రాసుకొచ్చారు.


ఆణిముత్యం

ఒలింపిక్స్‌లో భారత దేశానికి రజత పతకాన్ని నీరజ్ చోప్రా అందజేశాడు. ఒలింపిక్సే కాదు ఇతర ట్రోఫీల్లో కూడా అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. వరల్డ్ ఛాంపియన్ షిప్, ఏసియన్ గేట్స్, కామన్‌వెల్త్ గేమ్స్‌లో కూడా భారతదేశానికి పతకాలు అందజేశారు. దేశానికి నీరజ్ చోప్రా ఒక స్థిరమైన ఆటగాడు. ఆణిముత్యం అని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 12 , 2024 | 05:21 PM