Share News

మూడేళ్ల తర్వాత..

ABN , Publish Date - May 09 , 2024 | 05:04 AM

టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత స్వదేశంలో ఓ టోర్నీ బరిలో దిగుతున్నాడు. ఈనెల 12 నుంచి 15 వరకు భువనేశ్వర్‌లో జరిగే...

మూడేళ్ల తర్వాత..

స్వదేశీ టోర్నీ బరిలో నీరజ్‌

ఫెడరేషన్‌ కప్‌లో ఒలింపిక్‌ చాంప్‌

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత స్వదేశంలో ఓ టోర్నీ బరిలో దిగుతున్నాడు. ఈనెల 12 నుంచి 15 వరకు భువనేశ్వర్‌లో జరిగే ఫెడరేషన్‌ కప్‌లో వరల్డ్‌ చాంపియన్‌ నీరజ్‌ తలపడుతున్నట్టు నిర్వాహకులు బుధవారం వెల్లడించారు. ఈమేరకు తన ఎంట్రీని చోప్రా ఖరారు చేసినట్టు తెలిపారు. ఈనెల 10న దోహాలో ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌ సిరీస్‌ తొలి అంచె జరగనుంది. అందులో పోటీపడుతున్న స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌..అక్కడ నుంచి భారత్‌ రానున్నట్టు భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య తెలిపింది. 26 ఏళ్ల చోప్రా..2021లో భువనేశ్వర్‌లోనే జరిగిన ఫెడరేషన్‌ కప్‌లో చివరిసారి స్వదేశంలో తలపడ్డాడు. అప్పట్లో ఈటెను 87.80 మీ. దూరం విసిరిన అతడు స్వర్ణ పతకం సాధించాడు.

Updated Date - May 09 , 2024 | 05:04 AM