Share News

ఆరుబయట ఆటాపాట.. నీటిపై మార్చ్‌పాస్ట్‌

ABN , Publish Date - Jul 26 , 2024 | 04:05 AM

సంప్రదాయాన్ని బ్రేక్‌ చేస్తూ.. ఆరంభోత్సవాన్ని ప్రధాన స్టేడియం బయట నిర్వహించనున్నారు. సెన్‌ నదిలో సుమారు ఏడు వేల మంది అథ్లెట్లలో బోట్లలో పరేడ్‌ నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 6 కిలోమీటర్ల పరేడ్‌ తర్వాత...

ఆరుబయట ఆటాపాట.. నీటిపై మార్చ్‌పాస్ట్‌

సంప్రదాయాన్ని బ్రేక్‌ చేస్తూ.. ఆరంభోత్సవాన్ని ప్రధాన స్టేడియం బయట నిర్వహించనున్నారు. సెన్‌ నదిలో సుమారు ఏడు వేల మంది అథ్లెట్లలో బోట్లలో పరేడ్‌ నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 6 కిలోమీటర్ల పరేడ్‌ తర్వాత ఐఫిల్‌ టవర్‌ వద్ద ఇది ముగియనుంది. ఇందుకోసం 85 బోట్లను వినియోగించనున్నారు. దాదాపు 5 లక్షల మంది ఈ ఆరంభ వేడుకల వీక్షణకు రానున్నట్టు అంచనా. ప్రముఖ సింగర్లు సెలీనా డియాన్‌, లేడీ గాగా తమ ఆటపాటలతో ఉర్రూతలూగించనున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌ ఓపెనింగ్‌ సెర్మనీపై కరోనా ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఎక్కువ మంది వీక్షకులను కూడా అనుమతించలేదు. పారిస్‌లో మాత్రం అలాంటి ఇబ్బందులు లేకపోవడంతో.. మెగా ఈవెంట్‌కు అదిరే ఆరంభం దక్కాలని నిర్వాహకులు ప్రణాళికలు రచిస్తున్నారు. నీటిపై తేలియాడుతూ సాగే మార్చ్‌పాస్ట్‌లో భారత పతాకధారులుగా పీవీ సింధు, శరత్‌ కమల్‌ వ్యవహరించనున్నారు.

Updated Date - Jul 26 , 2024 | 04:05 AM