Share News

Paris Olympics: పోరాడి ఓడిన బ్యాడ్మింటన్ జట్టు..

ABN , Publish Date - Aug 01 , 2024 | 05:44 PM

పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. పురుషుల డబుల్స్ విభాగంగా అమలాపురానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, మహారాష్ట్రకు చెందిన చిరాగ్ శెట్టి జోడి క్వార్టర్ ఫైనల్స్‌లో విజయం సాధించి.. సెమీస్‌కు దూసుకెళ్లింది.

Paris Olympics: పోరాడి ఓడిన బ్యాడ్మింటన్ జట్టు..
Satwik and Chirag

పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. లీగ్ మ్యాచ్‌లో అదరగొట్టిన ఆటగాళ్లు క్వార్టర్ ఫైనల్స్‌లో పోరాడి ఓడారు. పురుషుల డబుల్స్ విభాగంలో అమలాపురానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, మహారాష్ట్రకు చెందిన చిరాగ్ శెట్టి జోడి క్వార్టర్ ఫైనల్స్‌లో ఓటమి చవిచూసింది. దీంతో పారిస్ ఒలింపిక్స్‌లో సాత్విక్ జోడి ప్రయాణం ముగిసింది. లీగ్ మ్యాచుల్లో భాగంగా సాత్విక్ జోడి ఆడిన రెండింటిలో విజయం సాధించి క్వార్టర్స్‌కు ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో మలేషియాకు చెందిన ఆరోన్ చియా, సో వూయ్ యిక్ జోడిపై 1-2సెట్ల తేడాతో ఓటమి చెందింది. మొదటిసెట్‌ను 21-13 తేడాతో సునాయసంగా గెలుచుకున్న సాత్విక్ జోడి రెండో సెట్‌ను 21-16 తేడాతో ఓడిపోయింది. మూడోసెట్‌లో 21-16 తేడాతో ఓడిపోయింది.


బ్యాడ్మింటన్‌లో పతకంపై ఆశలు..

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ షూటింగ్‌తో పాటు ఆర్చరీ, బ్యాడ్మింటన్‌లో పతకాలపై ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే షూటింగ్‌లో మూడు కాంస్య పతకాలు గెలుచుకోగా.. బ్యాడ్మింటన్‌లోనూ పతకాలపై ఆశలు పెట్టుకుంది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ శెట్టి జోడి పతకం గెలుస్తుందని ఆశలు పెట్టుకున్నప్పటికీ క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఓటమితో విజయయాత్రను ముగించింది. లక్ష్యసేన్, పీవీ సింధు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో గెలుపొంది ప్రీక్వార్టర్స్‌కు చేరారు. శుక్రవారం రాత్రి జరిగే ప్రీక్వార్టర్స్‌లో గెలిస్తే సింధు, లక్ష్యసేన్ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరతారు. ఇదే సమయంలో పురుషుల సింగిల్స్‌లో భారత్ క్రీడాకారుడు క్వార్టర్స్‌కు వెళ్లడం ఖాయమైంది. ప్రీక్వార్టర్స్‌లో లక్ష్యసేన్, ప్రణయ్‌తో పోటీపడతారు. ఇద్దరిలో ఎవరూ గెలిచినా భారత్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరనుంది.


చివరి వరకు పోరాడి..

బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడి క్వార్టర్ ఫైనల్స్‌లో పోరాడి ఓడింది. మొదటి సెట్‌ను ఈజీగా గెలుచుకున్న సాత్విక్ జోడి.. రెండో సెట్‌ను 14-21 తేడాతో ఓడిపోయారు. మూడో సెట్ ప్రారంభంలో మలేషియా జట్టు అధిక్యం ప్రదర్శించినప్పటికి సగం గేమ్ అయ్యే సమయానికి సాత్విక్ జోడి 11-9 లీడ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత 11-11 తో స్కోర్ సమం కాగా.. ఆ తర్వాత సాత్విక్ జోడి జాగ్రత్తగా ఆడుతూ 14-12కు చేరుకుంది. చివరిలో మలేషియా టీమ్ దూకుడుగా ఆడటంతో 16-21 తేడాతో మూడో సెట్‌లో సాత్విక్ జోడి ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Sports News and Latest Telugu News

Updated Date - Aug 01 , 2024 | 05:44 PM