Share News

జర్మనీలో నిఖత్‌ శిక్షణ

ABN , Publish Date - Jun 27 , 2024 | 05:16 AM

పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఆరుగురిలో ఒక్కరు మినహా మిగిలిన ఐదుగురు భారత బాక్సర్లు ప్రత్యేక శిక్షణ కోసం జర్మనీ వెళ్లనున్నారు. వీరిలో తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ కూడా ఉంది. ఈనెల 28న జర్మనీ బయలుదేరుతున్న ఈ ఐదుగురు

జర్మనీలో నిఖత్‌ శిక్షణ

న్యూఢిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఆరుగురిలో ఒక్కరు మినహా మిగిలిన ఐదుగురు భారత బాక్సర్లు ప్రత్యేక శిక్షణ కోసం జర్మనీ వెళ్లనున్నారు. వీరిలో తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ కూడా ఉంది. ఈనెల 28న జర్మనీ బయలుదేరుతున్న ఈ ఐదుగురు నెల రోజుల పాటు అక్కడ శిక్షణ తీసుకోనున్నారు. వరల్డ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ (50 కిలోలు), లవ్లీనా బొర్గోహైన్‌ (75 కి.), నిషాంత్‌ దేవ్‌ (71 కి.), ప్రీతి పవార్‌ (54 కి.), జాస్మిన్‌ లాంబోరియా (57 కి.) ఐర్లాండ్‌, అమెరికా, మంగోలియా, జర్మనీ, డెన్మార్క్‌ దేశాల బాక్సర్లతో కలిసి వీరు ప్రాక్టీస్‌లో పాల్గొంటారు. జర్మనీ వాతావరణం పారి్‌సకు దగ్గరగా ఉండడంతో అక్కడి పరిస్థితులకు కూడా భారత బాక్సర్లు అలవాటు పడతారని జాతీయ బాక్సింగ్‌ సమాఖ్య తెలిపింది. కామన్వెల్త్‌ స్వర్ణ పతక విజేత అమిత్‌ పంఘల్‌ (51 కి.) మాత్రం శిలారూలోని సాయ్‌ సెంటర్‌లోనే శిక్షణ కొనసాగించనున్నాడు. భారత్‌ నుంచి పారిస్‌ ఒలింపిక్స్‌లో ఈసారి ఆరుగురు బాక్సర్లు బరిలోకి దిగనున్నారు.

Updated Date - Jun 27 , 2024 | 05:16 AM