Share News

సెమీస్‌కు సబలెంక, నవారో

ABN , Publish Date - Sep 05 , 2024 | 02:34 AM

మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వేటలో ఉన్న బెలారస్‌ స్టార్‌ అర్యానా సబలెంక యూఎస్‌ ఓపెన్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన క్వార్టర్స్‌ పోరులో రెండోసీడ్‌ సబలెంక...

సెమీస్‌కు సబలెంక, నవారో

  • పురుషుల్లో టియాఫో, ఫ్రిట్జ్‌

  • జ్వెరెవ్‌, జెంగ్‌కు షాక్‌ ఫయూఎస్‌ ఓపెన్‌

న్యూయార్క్‌: మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వేటలో ఉన్న బెలారస్‌ స్టార్‌ అర్యానా సబలెంక యూఎస్‌ ఓపెన్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన క్వార్టర్స్‌ పోరులో రెండోసీడ్‌ సబలెంక 6-1, 6-2తో ఏడోసీడ్‌ జెంగ్‌ కిన్‌వెన్‌ (చైనా)ను చిత్తుచేసింది. గ్రాండ్‌స్లామ్‌లో సబలెంక చేతిలో ఓడడం జెంగ్‌కు ఇది వరుసగా రెండోసారి. మరో మ్యాచ్‌లో 13వ సీడ్‌ నవారో 6-2, 7-5తో 26వ సీడ్‌ పౌలా బడోసా (స్పెయిన్‌)ను ఓడించి గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారి సెమీస్‌ చేరింది.


లోకల్‌ స్టార్ల అమీతుమీ: పురుషుల సింగిల్స్‌లో ఇద్దరు లోకల్‌ స్టార్లు ఫ్రాన్సెస్‌ టియాఫో, టేలర్‌ ఫ్రిట్జ్‌ మధ్య సెమీఫైనల్‌ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. క్వార్టర్‌ఫైనల్లో 20వ సీడ్‌ ఫ్రాన్సెస్‌ టియాఫో 5-3, 6-7 (5), 6-3, 4-1తో ఆధిక్యంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి, 9వ సీడ్‌ గ్రిగోర్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా) గాయం కారణంగా మ్యాచ్‌ నుంచి వైదొలిగాడు. ఇక, 4వ సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) పోరాటం క్వార్టర్స్‌కే పరిమితమైంది. 12వ సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ 7-6(2), 3-6, 6-4, 7-6 (3)తో జ్వెరెవ్‌కు ఝలకిచ్చి తన స్నేహితుడు టియాఫోతో సెమీస్‌ పోరుకు సిద్ధమయ్యాడు.

Updated Date - Sep 05 , 2024 | 02:34 AM