Share News

మనోళ్ల దూకుడు

ABN , Publish Date - Nov 30 , 2024 | 04:53 AM

సొంతగడ్డపై జరుగుతున్న సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు జోరు కొనసాగిస్తున్నారు. సింగిల్స్‌, డబుల్స్‌, మిక్స్‌డ్‌ విభాగాల్లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లి టైటిళ్లను క్లీన్‌స్వీప్‌ చేసే

మనోళ్ల దూకుడు

సెమీస్‌కు సింధు, ఉన్నతి, లక్ష్య, రజావత్‌,

డబుల్స్‌లో గాయత్రి, అశ్వని జోడీలు

సయ్యద్‌ మోదీ బ్యాడ్మింటన్‌

లఖ్‌నవూ: సొంతగడ్డపై జరుగుతున్న సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు జోరు కొనసాగిస్తున్నారు. సింగిల్స్‌, డబుల్స్‌, మిక్స్‌డ్‌ విభాగాల్లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లి టైటిళ్లను క్లీన్‌స్వీప్‌ చేసే దిశగా దూసుకెళ్తున్నారు. మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో రెండుసార్లు చాంపియన్‌, టాప్‌సీడ్‌ పీవీ సింధు 21-15, 21-17తో చైనాకు చెందిన డాయి వాంగ్‌ను చిత్తు చేసింది. మరో భారత అమ్మాయి ఉన్నతి హుడా 21-16, 21-9తో ఇషికా జైస్వాల్‌ (అమెరికా)ను ఓడించి సెమీ్‌సలో సింధుతో అమీతుమీకి సిద్ధమైంది. పురుషుల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ లక్ష్య సేన్‌ 21-8, 21-19తో సహచర షట్లర్‌ మీరాబా లువాంగ్‌ మైస్నమ్‌పై, రెండో సీడ్‌ ప్రియాన్షు రజావత్‌ 21-13, 21-8తో గుయెన్‌ హై డాంగ్‌ (హాంకాంగ్‌)పై గెలిచి సెమీ్‌సలో ప్రవేశించారు. మహిళల డబుల్స్‌లో రెండో సీడ్‌ గాయత్రీ గోపీచంద్‌/ట్రీసా జాలీ జోడీ 21-8, 21-15తో ఆరో సీడ్‌, మలేసియా ద్వయం గో కీ/టో మి జింగ్‌పై, టాప్‌ సీడ్‌ అశ్వినీ పొన్నప్ప/తనీషా క్యాస్ట్రో జంట 21-12, 17-21, 21-16తో భారత్‌కే చెందిన శ్రుతి మిశ్రా/ప్రియపై గెలిచి సెమీస్‌ లోకి అడుగుపెట్టాయి. పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన ఇషాన్‌ భట్నాగర్‌/శంకర్‌ ప్రసాద్‌ జోడీ 21-12, 30-29తో మూడో సీడ్‌, మలేసియా జంట ఆరోన్‌/కాంగ్‌ కై జింగ్‌పై, పృథ్వీ కృష్ణమూర్తి/సాయిప్రతీక్‌ ద్వయం 12-21, 21-11, 21-16తో మలేసియాకే చెందిన లిమ్‌ జి/వాంగ్‌ తిమ్‌ జోడీపై గెలిచి సెమీస్‌లో ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత జంట, ఐదో సీడ్‌ తనీషా క్యాస్ట్రో/ధ్రువ్‌ కపిల 21-16, 21-13తో లూ బింగ్‌/హో లొ (మలేసియా) జోడీని ఓడించి ఫైనల్‌కు అడుగుదూరంలో నిలిచింది.

Updated Date - Nov 30 , 2024 | 05:38 PM