Share News

టీ20 వరల్డ్‌ కప్‌ ఐర్లాండ్‌ కెప్టెన్‌ స్టిర్లింగ్‌

ABN , Publish Date - May 09 , 2024 | 05:09 AM

వరల్డ్‌ కప్‌లో తలపడే ఐర్లాండ్‌ జట్టును బుధవారం ప్రకటించారు. 15 మంది సభ్యుల జట్టుకు వెటరన్‌ ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు...

టీ20 వరల్డ్‌ కప్‌ ఐర్లాండ్‌ కెప్టెన్‌ స్టిర్లింగ్‌

డబ్లిన్‌: వరల్డ్‌ కప్‌లో తలపడే ఐర్లాండ్‌ జట్టును బుధవారం ప్రకటించారు. 15 మంది సభ్యుల జట్టుకు వెటరన్‌ ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. వచ్చేనెల ఒకటి నుంచి వెస్టిండీస్‌, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న మెగా టోర్నీ గ్రూప్‌ ‘ఎ’లో ఐర్లాండ్‌ తలపడనుంది. జూన్‌ ఐదున న్యూయార్క్‌లో జరిగే తమ తొలి మ్యాచ్‌లో భారత జట్టును ఐర్లాండ్‌ ఢీకొననుంది. ఇక మెగా టోర్నమెంట్‌కు న్యూగినీ జట్టును కూడా ప్రకటించారు. అసడోలా వాలా సారథ్యంలో న్యూగినీ కప్పు బరిలో దిగనుంది.

Updated Date - May 09 , 2024 | 05:10 AM