Share News

వైభవ్‌ సెంచరీ

ABN , Publish Date - Oct 02 , 2024 | 01:31 AM

పదమూడేళ్ల ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (104) శతకంతో చెలరేగినా.. ఆసీస్‌ స్పిన్నర్‌ విశ్వ రామ్‌కుమార్‌ దెబ్బకు భారత అండర్‌-19 జట్టు మిడిలార్డర్‌ తడబడింది. దీంతో భారీ స్కోరు చేస్తుందనుకొన్న..

వైభవ్‌ సెంచరీ

  • యువ భారత్‌ 296 ఆలౌట్‌

  • అండర్‌-19 అనధికార టెస్ట్‌

చెన్నై: పదమూడేళ్ల ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (104) శతకంతో చెలరేగినా.. ఆసీస్‌ స్పిన్నర్‌ విశ్వ రామ్‌కుమార్‌ దెబ్బకు భారత అండర్‌-19 జట్టు మిడిలార్డర్‌ తడబడింది. దీంతో భారీ స్కోరు చేస్తుందనుకొన్న భారత్‌ కేవలం 3 పరుగుల ఆధిక్యాన్ని మాత్రమే అందుకుంది. ఆటకు రెండో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 103/0తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌ 296 పరుగులకు ఆలౌటైంది. విహాన్‌ మల్హోత్రా (76) హాఫ్‌ సెంచరీ చేయగా.. కెప్టెన్‌ సోహమ్‌ (33), అభిజ్ఞాన్‌ కుండూ (32) ఫర్వాలేదనిపించారు. విశ్వ రామ్‌కుమార్‌ 4 వికెట్లు, థామస్‌ బ్రౌన్‌ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన ఆసీస్‌ 110/4 స్కోరు చేసింది. మంగళవారం ఆట నిలిచే సమయానికి సైమన్‌ బడ్జ్‌ (4), క్రిస్టియన్‌ హో (2) క్రీజులో ఉన్నారు. ఓపెనర్‌ రైలీ కింగ్‌సెల్‌ (48), ఆలివర్‌ పీక్‌ (32) రాణించారు. మొత్తంగా ఆసీస్‌ 107 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఎనాన్‌ 2 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులు చేసింది.

Updated Date - Oct 02 , 2024 | 01:31 AM