Share News

Vinesh Phogat: వినేశ్ ఫొగట్‌కి భారీ ఎదురుదెబ్బ.. ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చిన సీఏఎస్

ABN , Publish Date - Aug 14 , 2024 | 09:54 PM

పారిస్ ఒలింపిక్స్ 2024(Olympics 2024)లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్‌కు వెళ్లకముందే అనర్హత వేటుకి గురైన వినేశ్ ఫొగట్‌కి మరో షాక్ తగిలింది. రజత పతకం ఇవ్వాలని ఆమె చేసిన విజ్ఞప్తిని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) తోసిపుచ్చింది.

Vinesh Phogat: వినేశ్ ఫొగట్‌కి భారీ ఎదురుదెబ్బ.. ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చిన సీఏఎస్

ఇంటర్నెట్ డెస్క్: పారిస్ ఒలింపిక్స్ 2024(Olympics 2024)లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్‌కు వెళ్లకముందే అనర్హత వేటుకి గురైన వినేశ్ ఫొగట్‌కి మరో షాక్ తగిలింది. రజత పతకం ఇవ్వాలని ఆమె చేసిన విజ్ఞప్తిని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) తోసిపుచ్చింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW)కి వ్యతిరేకంగా రెజ్లర్ వినేష్ ఫోగాట్ చేసిన దరఖాస్తును కొట్టివేయాలని సీఏఎస్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై భారత ఒలింపిక్ సంఘం (IOA) అధ్యక్షురాలు పీటీ ఉష నిరాశ వ్యక్తం చేశారు.


జరిగిందిదే..

స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌కు రజత పతకం దక్కుతుందా లేదా అనే ఉత్కంఠతో ఈ సోమవారం భారత క్రీడాభిమానులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూశారు. ముందుగా ప్రకటించిన సమయం ప్రకారం రాత్రి 9.30 గంటలకు కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (కాస్‌) ఎలాంటి తీర్పునివ్వబోతోందోనన్న ఆత్రుత అందరిలోనూ కనిపించింది. కానీ తీరా ఆ సమయానికి తుది తీర్పు మరోసారి వాయిదా పడిందన్న నిర్ణయం రావడంతో అంతా ఉసూరుమన్నారు. తీర్పును ఆగస్టు 16కు వాయిదా వేసింది కాస్.

కాగా రెండ్రోజుల ముందుగానే బుధవారం కాస్ తన తీర్పును వెలువరించింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో వినేశ్‌ మహిళల 50కేజీ విభాగం ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. కానీ సరిగ్గా పోటీలకు ముందు తన బరువు 100 గ్రాములు ఎక్కువగా ఉండడంతో డిస్‌క్వాలిఫై కావడం అందరినీ షాక్‌కు గురిచేసింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం కావడంతో పాటు భారత ఒలింపిక్‌ సంఘం కూడా వెంటనే ఈ విషయాన్ని కాస్‌లో అప్పీల్‌ చేసింది. వినేశ్‌కు కనీసం రజతమైనా ఇవ్వాలనే డిమాండ్‌ వినిపించింది. రజతం ఇవ్వడానికి కాస్ నిరాకరించడంతో భారత ప్రజలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.

Updated Date - Aug 14 , 2024 | 09:54 PM