Vinod Kambli: అయ్యో.. వినోద్ కాంబ్లీకి ఏమైంది? నడవలేని స్థితిలో టీమిండియా మాజీ బ్యాటర్!
ABN , Publish Date - Aug 06 , 2024 | 02:43 PM
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్క్‌ర్ చిన్ననాటి స్నేహితుడు, 90వ దశకంలో టీమిండియా స్టార్ బ్యాటర్‌గా ఓ వెలుగు వెలిగిన ఆటగాడు అయిన వినోద్ కాంబ్లీ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతడి అనారోగ్య సమస్య ఏంటో బయటకు వెల్లడి కాలేదు, కానీ అతడు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్క్‌ర్ (Sachin Tendulkar) చిన్ననాటి స్నేహితుడు, 90వ దశకంలో టీమిండియా స్టార్ బ్యాటర్‌గా ఓ వెలుగు వెలిగిన ఆటగాడు వినోద్ కాంబ్లీ (Vinod Kambli) ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతడి అనారోగ్య సమస్య ఏంటో బయటకు వెల్లడి కాలేదు, కానీ అతడు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. అతడికి సంబంధించిన తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో వినోద్ కాంబ్లీ నడిచేందుకు కూడా ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తోంది. తన కాళ్లపై స్వతహాగా నిలబడలేకపోయాడు. పక్కన ఇద్దరు మనుషులు పట్టుకుని అతడిని నడిపించుకుని తీసుకెళ్లారు. అతడు 2013లో తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు. ఆ సమస్య నుంచి కాస్త కోలుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అతడి పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదని తాజా వీడియో రుజువు చేస్తోంది. తాజా వీడియోను షేర్ చేసిన ఓ వ్యక్తి ``వినోద్ కాంబ్లీ శారీరక అనారోగ్యంతో పాటు డిప్రెషన్‌తో కూడా బాధపడుతున్నాడు. త్వరలోనే అతడు కోలుకోవాలని, అవసరమైన సాయం అతడికి అందించాలని కోరుకుంటున్నాను`` అంటూ ట్వీట్ చేశారు.
ఈ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. అతడు మద్యం సేవించి ఉన్నాడేమో అని కొందరు కామెంట్లు చేశారు. అతడి దీన స్థితి చూసి మరికొందరు జాలి కురిపించారు. అతడిని ఆదుకోవాలని కొందరు బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. వినోద్ కాంబ్లీ 1993-2000 మధ్య టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అనంతరం క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి..
French Open: అదరగొట్టిన సాత్విక్ - చిరాగ్ శెట్టి.. ఫైనల్స్ దూసుకెళ్లిన జోడీ
Rahul Dravid: ఇషాన్-శ్రేయాస్ కాంట్రాక్ట్ ఇష్యూపై రాహుల్ ద్రవిడ్ స్పందన
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..