Layoffs: 80 వేల ఉద్యోగాలు మటాష్.. సాఫ్ట్‌వేర్ రంగానికేమైంది
ABN , Publish Date - May 05 , 2024 | 10:00 AM
ప్రస్తుతం అత్యధిక ఉద్యోగాలు ప్రమాదంలో పడిన రంగమేదైనా ఉందంటే అది సాఫ్ట్‌వేరే(Software Field). లే ఆఫ్ అనే పదం ఇప్పుడు సాధారణమైపోయింది. అత్యధిక నైపుణ్యాలు కలిగిన నిపుణులను సైతం ఉద్యోగాల నుంచి కంపెనీలు నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి.
న్యూయార్క్: ప్రస్తుతం అత్యధిక ఉద్యోగాలు ప్రమాదంలో పడిన రంగమేదైనా ఉందంటే అది సాఫ్ట్‌వేరే(Software Field). లే ఆఫ్ అనే పదం ఇప్పుడు సాధారణమైపోయింది. అత్యధిక నైపుణ్యాలు కలిగిన నిపుణులను సైతం ఉద్యోగాల నుంచి కంపెనీలు నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి.
ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే ఐటీ రంగంలో 80 వేల ఉద్యోగుల్ని కంపెనీలు తొలగించాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ రంగంపై పెను ప్రభావం పడుతోంది. 279 టెక్ కంపెనీలు మే 3 వరకు 80,230 మంది ఉద్యోగులను తొలగించాయి.
2022-23లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు 4,25,000పైగా ఉద్యోగులను తొలగించాయి. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల కారణంగా ప్రాజెక్టుల రాక తగ్గడంతో, ఐటీ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్నాయి. స్ప్రింక్లర్ దాదాపు 116 మంది ఉద్యోగులను, పెరోటన్ వర్క్‌ఫోర్స్‌లో 15 శాతం మంది ఉద్యోగులను(400 ఉద్యోగులు) తొలగించింది.
గూగుల్ దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ విషయంలో టెస్లా కూడా తీసిపోలేదు. టెస్లా 14 వేల మంది ఉద్యోగులను తీసివేసింది. రానున్న రోజుల్లో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోతాయని అంతర్జాతీయ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.
For Latest News and National News click here