Share News

BSNL: మీ దగ్గర్లోని బీఎస్ఎన్‌ఎల్ టవర్ లొకేషన్ తెలుసుకోండిలా

ABN , Publish Date - Jul 26 , 2024 | 09:39 AM

జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ - ఐడియా.. టారీఫ్ ధరలు పెంచడంతో వినియోగదారులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితి జవసత్వాలు కోల్పోతున్న ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్‌కి (BSNL) వరంగా మారింది.

BSNL: మీ దగ్గర్లోని బీఎస్ఎన్‌ఎల్ టవర్ లొకేషన్ తెలుసుకోండిలా

ఇంటర్నెట్ డెస్క్: జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ - ఐడియా.. టారీఫ్ ధరలు పెంచడంతో వినియోగదారులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితి జవసత్వాలు కోల్పోతున్న ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్‌కి (BSNL) వరంగా మారింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా మంది బీఎస్ఎన్‌ఎల్‌కి పోర్ట్ అయ్యారు. మిగతా టెలికాం కంపెనీలతో పోల్చితే బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ ధరలు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం.

ఈ సంస్థ ఇప్పుడు 4G నెట్‌వర్క్‌కి మారింది. టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆధీనంలోని టెలికాం కంపెనీ BSNL 4G సేవలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం నిరంతరం నిఘా ఉంచుతుందని తెలిపారు. అయితే ప్రైవేటు కంపెనీలు 5జీ సేవలు అందిస్తుంటే బీఎస్ఎన్ఎల్ మాత్రం 4జీ సేవలు అందించేందుకే అవస్థలు పడుతోంది.


బీఎస్ఎన్ఎల్ కు ఊరటగా కేంద్ర బడ్జెట్‌లో రూ.82,916 కోట్లు కేటాయించారు. కేంద్రం ఇలాగే బీఎస్ఎన్ఎల్‌కు అండగా ఉండి 5జీ తీసుకొస్తే ఆ నెట్‌వర్క్‌లోకి వెళ్లేందుకు యూజర్లు సిద్ధమవుతారని అభిప్రాయం వ్యక్తమౌతోంది. ప్రస్తుతానికైతే 4జీ సేవలందిస్తున్న ఈ టెలికాం కంపెనీకి సంబంధించి ఇంటర్నెట్ వేగాన్ని మరింతగా అందుకోవాలంటే.. బీఎస్ఎన్ఎల్ టవర్ దగ్గర్లో ఎక్కడుంటుందో తెలుసుకోవాలి.


ఒక టవర్ ఇతర ఫోన్‌ల నుంచి సిగ్నల్‌లను పంపడం, స్వీకరించడం కోసం రేడియో ట్రాన్స్‌మిటర్, రిసీవర్‌ను కలిగి ఉంటుంది. ఈ సంకేతాలు తక్కువ శక్తితో ఉంటాయి. తక్కువ దూరం మాత్రమే ప్రయాణించగలవు. సెల్ ఫోన్‌లు "సెల్" అని కూడా పిలిచే సమీప బేస్ స్టేషన్‌తో కమ్యూనికేట్ చేయడానికి అనుమతిస్తాయి.

బేస్ స్టేషన్ అనేక సెల్ ఫోన్‌ల నుంచి సిగ్నల్‌లను రూట్ చేస్తుంది. బేస్ స్టేషన్‌ల మధ్య కాల్‌లను ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. కాబట్టి ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు ఎలాంటి అంతరాయం లేకుండా ఉండాలి. దగ్గర్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ సమీప టవర్‌లను కనుగొని, అవి ఏ నెట్‌వర్క్‌కి పని చేస్తున్నాయో తెలుసుకోవడానికి సంచర్ తరంగ్ పోర్టల్‌ని ఉపయోగించవచ్చు.


బీఎస్ఎన్ఎల్ టవర్‌ను ఎలా కనుగొనాలి

Step 1: ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Step 2: కిందకి స్క్రోల్ చేసి, 'మై లొకేషన్'పై క్లిక్ చేయండి

Step 3: తదుపరి స్క్రీన్‌లో మీ పేరు, ఇమెయిల్, మొబైల్ నంబర్, క్యాప్చా నమోదు చేయండి

Step 4: ‘Send me a mail with OTP’పై క్లిక్ చేయండి

Step 5: OTPని ఎంటర్ చేయండి.

Step 6: తదుపరి స్క్రీన్‌లో మీకు సమీపంలో ఉన్న అన్ని సెల్ ఫోన్ టవర్‌లతో కూడిన మ్యాప్ కనిపిస్తుంది.

Step 7: సిగ్నల్ రకం (2G/3G/4G లేదా 5G), ఆపరేటర్ సమాచారాన్ని పొందడానికి ఏదైనా టవర్‌పై క్లిక్ చేయండి.

Updated Date - Jul 26 , 2024 | 09:39 AM