Share News

BSNL: బీఎస్ఎన్ఎల్‌లో అదిరిపోయే రీచార్జ్ ప్లాన్.. రూ.200కే 70 రోజుల చెల్లుబాటు

ABN , Publish Date - Aug 26 , 2024 | 07:27 AM

ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్(BSNL) తమ వినియోగదారుల కోసం సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

BSNL: బీఎస్ఎన్ఎల్‌లో అదిరిపోయే రీచార్జ్ ప్లాన్.. రూ.200కే 70 రోజుల చెల్లుబాటు

ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్(BSNL) తమ వినియోగదారుల కోసం సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. టారిఫ్ ఛార్జీల పెంపుతో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు తమ రీఛార్జ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. అయితే బీఎస్ఎన్ఎల్ మాత్రం తన ప్లాన్‌లను పాత ధరలతోనే కొనసాగిస్తోంది.

తద్వారా ప్రైవేటు టెలికాం కంపెనీల వినియోగదారులు అధిక సంఖ్యలో బీఎస్ఎన్ఎల్‌కి పోర్ట్ అవుతున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో బీఎస్ఎన్ఎల్‌లో చేరారు. జులై నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అయితే బీఎస్ఎన్ఎల్ సిమ్‌ని ఉపయోగించే వారికి అతి తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలు అందించే ప్లాన్ గురించి తెలుసుకుందాం. బీఎస్ఎన్ఎల్ పాపులర్ ప్లాన్‌లలో రూ.200లోపు రెండు రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి.


వివరాలు..

కస్టమర్లను ఆకర్షించడానికి, ఉన్న కస్టమర్లను నిలుపుకోవడానికి BSNL నిరంతరం ఆకర్షణీయమైన ఆఫర్‌లతో రీఛార్జ్ ప్లాన్‌లను రూపొందిస్తోంది. అటువంటిదే రూ. 197 ప్లాన్. ఎక్కువ ఖర్చు లేకుండా చాలా కాలంపాటు తమ సిమ్ కార్డ్‌లను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. రూ. 200 ధరతో మరే ఇతర టెలికాం ప్రొవైడర్ 70 రోజుల చెల్లుబాటుతో ప్లాన్‌ను అందించదు. ఈ ప్లాన్ వినియోగదారులకు డేటా, అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తోంది. అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి.

ప్లాన్ 70 రోజుల చెల్లుబాటును కలిగి ఉండగా, ఉచిత కాలింగ్, డేటా మొదటి 15 రోజులకు మాత్రమే వస్తాయి. ఈ వ్యవధిలో వినియోగదారులు ప్రతిరోజూ 2GB డేటాను, రోజుకు 100 SMSలను పొందుతారు. 15 రోజులయ్యాక మిగతా ప్రయోజనాలు దీర్ఘకాలం చెల్లుబాటు అవుతాయి. ఇది వినియోగదారులు తమ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి సాయపడతాయి.


నెల రోజులపాటు..

చాలా రోజులపాటు సిమ్ యాక్టివ్‌గా ఉండటానికి రూ.147తో 30 రోజుల గడువు ఉన్న ప్లాన్‌ మరో ఆప్షన్. Jio, Airtel, Vi వంటి ప్రముఖ టెలికాం కంపెనీలేవీ ఇలాంటి రీఛార్జ్ ప్లాన్‌లను అందించట్లేదు. డబ్బులు ఆదా చేయాలని చూస్తున్న వారికి బీఎస్‌ఎన్ఎల్‌లో ఇవి బెస్ట్ ప్లాన్స్.

For Latest News click here

Updated Date - Aug 26 , 2024 | 07:27 AM