Share News

Samsung Galaxy S24 FE: శామ్‌సంగ్ గెలాక్సీ S24 FE కొనాలనుకుంటున్నారా? లాంఛింగ్‌కు ముందే ఫీచర్లు లీక్..

ABN , Publish Date - Jul 03 , 2024 | 11:55 AM

మీరు శామ్‌సంగ్ అభిమానులా? శామ్‌సంగ్ గెలాక్సీ S24 FE (Samsung Galaxy S24 FE) ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా? ఆ మొబైల్‌ను కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. లాంఛింగ్‌కు ముందే ఆ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ఇతర వివరాలు లీక్ అవుతున్నాయి

Samsung Galaxy S24 FE: శామ్‌సంగ్ గెలాక్సీ S24 FE కొనాలనుకుంటున్నారా? లాంఛింగ్‌కు ముందే ఫీచర్లు లీక్..
Samsung Galaxy S24 FE, Features

మీరు శామ్‌సంగ్ అభిమానులా? శామ్‌సంగ్ గెలాక్సీ S24 FE (Samsung Galaxy S24 FE) ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా? ఆ మొబైల్‌ను కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. లాంఛింగ్‌కు ముందే ఆ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ఇతర వివరాలు లీక్ అవుతున్నాయి (Samsung Galaxy S24 FE Features). ఈ మొబైల్ గత ఏడాది విడుదలైన శామ్‌సంగ్ గెలాక్సీ S23 FEకి అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ వెర్షన్‌లో కొత్తగా చాలా ఏఐ ఫీచర్లు అమర్చినట్టు వార్తలు వస్తున్నాయి. మరి, ఈ శామ్‌సంగ్ గెలాక్సీ S24 FE వివరాలు తెలుసుకుందామా..


త్వరలో విడుదల కాబోతున్న శామ్‌సంగ్ గెలాక్సీ S24 FE ఐదు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండనుంది. నలుపు, బూడిద రంగు, లేత నీలం, లేత ఆకుపచ్చ, పసుపు రంగుల్లో ఈ మొబైల్ హ్యాండ్‌సెట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ కొత్త వెర్షన్ మొబైల్ డిజైన్ చాలా వరకు పాత S23 FE మోడల్‌నే పోలి ఉంది.


శామ్‌సంగ్ గెలాక్సీ S24 FE స్పెషిఫికేషన్లు (అంచనా)..

1)6.65-అంగుళాల FHD + AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్

2)స్మార్ట్‌ఫోన్ Exynos 2400 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది

3)హ్యాండ్‌సెట్‌లో ఇన్-బిల్డ్ గెలాక్సీ AI ఫీచర్ ఉంటుంది

4)12GB రామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది

5) 5,000mAh బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంటుంది

6)ఇది 45W వైర్డు, 15W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది

7) ఆండ్రాయిడ్ వెర్షన్ 15 ఆధారంగా OneUI 6.1తో అనుసంధానం అయింది.

8)స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది

9) 32MP సెల్ఫీ కెమేరాను కలిగి ఉంది

Updated Date - Jul 03 , 2024 | 11:55 AM