Share News

Microsoft Windows: మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్..అనేక మందికి సమస్యలు, ఫ్లైట్స్ రద్దు

ABN , Publish Date - Jul 19 , 2024 | 01:23 PM

ప్రముఖ సాఫ్ట్‌వేర్ మైక్రోసాఫ్ట్ విండోస్(microsoft windows) ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వినియోగదారులను ఇబ్బందుల్లో పడేసింది. ఈ క్రమంలో జూలై 19న అనేక మంది వినియోగదారుల కంప్యూటర్‌లలో Windows “బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్” (Blue Screen of Death) లోపాన్ని ఎదుర్కొన్నారు.

Microsoft Windows: మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్..అనేక మందికి సమస్యలు, ఫ్లైట్స్ రద్దు
microsoft windows error

ప్రముఖ సాఫ్ట్‌వేర్ మైక్రోసాఫ్ట్ విండోస్ (microsoft windows) సేవలు ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయ్యాయి. ఈ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘మైక్రోసాఫ్ట్ ఔటేజ్’ సమస్య కారణంగా అంతర్జాతీయంగా విమానాలు, మార్కెట్లు, బ్యాంకులు, స్టాక్ ఎక్స్చేంజీ సేవలపై ప్రభావం పడింది.

ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వినియోగదారులు తమ కంప్యూటర్‌లలో విండోస్ ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్’ (Blue Screen of Death) సమస్య ఎదురైందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. దీంతో విమానాశ్రయాలు, టెలివిజన్ వార్తా స్టేషన్లు, పలు ఆర్థిక సంస్థలు సహా అనేక చోట్ల ఈ ప్రభావం కనిపించింది. దీంతో మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్ అయ్యిందని అనేక మంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు.


యాంటీ వైరస్

ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ సమస్యకు కారణం ఇటీవల విడుదలైన CrowdStrike కావచ్చని తెలుస్తోంది. CrowdStrike అనేది యాంటీ వైరస్. ఇది ఎండ్‌పాయింట్ సెక్యూరిటీ కంపెనీ. వినియోగదారులు ఈ BSOD లోపాన్ని పొందడం ప్రారంభించిన వెంటనే CrowdStrike సమస్య వచ్చింది. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలు కూడా కొన్ని గంటలపాటు నిలిచిపోయాయి. అమెరికాలో కొన్ని విమాన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని నివేదికల ప్రకారం వినియోగదారులు Microsoft 365ని యాక్సెస్ చేయడంలో సమస్యలను కూడా ఎదుర్కొన్నారు.


అవంతరాలు

ఈ సమస్య కారణంగా కొన్ని విమానాలు రద్దు కావడం విశేషం. చాలా మంది తమ రోజువారీ పనులను పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. SPICEJET సహా అనేక కంపెనీలు తమ సేవలను రద్దు చేశాయి. టికెట్ల బుకింగ్ సహా పలు కార్యకాలపాలలో అవంతరాలు ఏర్పడటంతో ఫ్లైట్స్ రద్దయ్యాయి. ప్రస్తుతానికి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం సూచించలేదు. అయితే క్రౌడ్‌స్ట్రైక్ సమస్యను పరిశోధిస్తోంది. త్వరలో ఒక ప్యాచ్‌ను విడుదల చేయాలని భావిస్తున్నారు. కొంతమంది నిపుణులు మీ కంప్యూటర్‌ను సేఫ్ మోడ్‌లో రీబూట్ చేయడానికి ప్రయత్నించమని సూచిస్తున్నారు. మీకు సాంకేతికంగా అవగాహన లేకుంటే నిపుణుల సహాయం తీసుకోవడం మంచిది.


భవిష్యత్తులో మళ్లీ వస్తే ఎలా

ఇటువంటి సమస్యలను పూర్తిగా నివారించలేము. కానీ మీరు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చు. మీ ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడం ముఖ్యం. అలాగే ఏదైనా కొత్త అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు దాని సమీక్షలను చదవడం మంచిది. ఇతర వినియోగదారులకు సమస్యలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఇది మీకు సహాయం చేస్తుంది.


ఇవి కూడా చదవండి:

Jio: రూ.276కే రోజుకి 2.5 జీబీ డేటా.. అదిరిపోయిన జియో ప్లాన్


Jobs: గుడ్ న్యూస్ చెప్పిన ప్రముఖ టెక్ సంస్థలు.. త్వరలోనే 60 వేల ఉద్యోగాలు..!

Budget 2024: బడ్జెట్‌ 2024 నేపథ్యంలో పెరగనున్న స్టాక్స్ ఇవే..!


For Latest News and Business News click here

Updated Date - Jul 19 , 2024 | 01:45 PM