Share News

TG: వాహనాలన్నీ హైదరాబాద్‌ వైపే!

ABN , Publish Date - May 14 , 2024 | 03:27 AM

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నవారు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు ఓట్లు వేసిన తర్వాత సోమవారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌ బాట పట్టారు. దీంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది.

TG: వాహనాలన్నీ హైదరాబాద్‌ వైపే!

  • ఊళ్ల నుంచి నగరానికి తిరిగి వస్తున్న ఓటర్లు

  • పంతంగి టోల్‌గేటు వద్ద ట్రాఫిక్‌ జామ్‌

చౌటుప్పల్‌ రూరల్‌/టౌన్‌, మే 13: తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నవారు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు ఓట్లు వేసిన తర్వాత సోమవారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌ బాట పట్టారు. దీంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద అర కిలోమీటరు మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది.


టోల్‌ గేటు దాటడానికి 15 నిమిషాల సమయం పట్టింది. 16 గేట్లకు గాను 10 గేట్ల ద్వారా హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలను పంపుతున్నారు. సాధారణ రోజుల్లో నిత్యం 30 నుంచి 35 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సోమవారం 45 వేల వాహనాలు హైదరాబాద్‌ వైపు వెళ్లినట్లు టోల్‌గేట్‌ సిబ్బంది తెలిపారు. అర్ధరాత్రి వరకు వాహనాల రద్దీ కొనసాగింది. బస్సుల కోసం ప్రజలు బస్టా్‌పల వద్ద గంటల తరబడి ఎదురు చూశారు.

Updated Date - May 14 , 2024 | 03:27 AM