Share News

రచయిత పురాణపండ శ్రీనివాస్ తర్వాత అమోఘ రచనా సంకలనాలకు, వారి అనుష్టాన వైభవానికి తెరపడబోతోందా?

ABN , Publish Date - May 31 , 2024 | 12:46 AM

అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా అందించిన మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ భారతీయ చలన చిత్ర రికార్డులను బద్దలు కొట్టుకుంటూ దూసుకుపోయి ఆస్కార్ కైవసం చేసుకుని, కోట్ల మనసుల్ని కొల్లగొట్టిన విషయం ప్రపంచమంతటా తెలుసున్న విషయమే. అయితే ఈ చిత్రం వెండితెరపై పడగానే ప్రత్యేక కృతజ్ఞతలంటూ మొదట కనిపించే ఫోటో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌దే. ఇదేమైనా మామూలు విషయమా? శ్రీనివాస్ నిస్వార్ధ సేవకు, నిష్కపటమైన మనస్సుకూ, నిరంతరం శ్రమించే తత్వానికి, యజ్ఞభావనకూ, అసాధారణ ప్రతిభకు దైవం రాజమౌళి రూపంలో యిచ్చిన కానుకని చెప్పాలి.

రచయిత పురాణపండ శ్రీనివాస్ తర్వాత అమోఘ రచనా సంకలనాలకు, వారి అనుష్టాన వైభవానికి తెరపడబోతోందా?

హైదరాబాద్, మే 30: మానవ జీవన సాఫల్యానికి సనాతన ధర్మమే అవసరమని యావద్భారత దేశంలోని తెలుగు లోగిళ్ళకు తరాలుగా అద్భుత ప్రవచనాలతో, అమోఘ గ్రంధాలతో గొంతెత్తి చెబుతున్న అనుష్ఠాన పండిత కుటుంబమైన పురాణపండ వారి కుటుంబంలో ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ‘ఆరాధన’ మాసపత్రిక పూర్వ సంపాదకులు, శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అందిస్తున్న అసాధారణ భక్తి సేవ తర్వాత.. ఆ అద్భుత కుటుంబం నుంచి ఇలాంటి గొప్ప సేవ అందించే వెలుగులు లేక.. ఈ అపూర్వ సంప్రదాయ సేవకు ఇక తెరపడుతోందని.. ఇది చాలా బాధాకరమని.. ప్రస్తుతం పురాణపండ శ్రీనివాస్ అందిస్తున్నఅమోఘ రచనా ప్రచురణల అపురూప సేవ ‘న భూతొ న భవిష్యత్’ అని ఉభయ గోదావరులకు చెందిన కొందరు ఘనాపాఠీలు, వేదపండితులు పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రంలో జరిగిన ఒక వైదిక సదస్సులో ఆవేదన చెందినట్లు సమాచారం.

ఒక నలభై ఏళ్ళు వెనక్కి వెళితే గోదావరి తీరం చెప్పే కథల్లో ఒక అపురూపమైన, అరుదైన పవిత్ర కుటుంబం శ్రమ దర్శనమిస్తుందని, పురాణ వేదాంత యోగ శాస్త్రాల్లో అపార పాండిత్యధురీణులైన పురాణవాచస్పతి స్వర్గీయ పురాణపండ రామమూర్తి సనాతన ధర్మసంస్కృతులు గుర్తుకువస్తాయని, రామమూర్తిగారి ధార్మిక ప్రేరణలు, అమోఘ ప్రసంగాలు, చండీ యాగాది క్రతువులు ఈనాటికీ పెద్ద తరాలవారు అద్భుతమైన మహిమలుగా చెబుతుంటారు.

Puranapanda-Srinivas-Parent.jpg

ఈ తరంవారు తెలుసుకోవలసిన కుటుంబం ఇది.

సామాజిక జీవనంలో సంప్రదాయ అభినివేశానికి నిలువెత్తు గంభీర రూపం రామమూర్తి గారని, ఆయన పాండితీ ప్రకర్ష అసాధారణం. రామమూర్తి గారు ఆరోజుల్లో శంఖధ్వానంలాంటి గొంతుతో ఎన్నెన్నో పురాణేతిహాసాల కథా ప్రవచనాలు చెబుతుంటే వేలల్లో శ్రోతలు నిలబడి వినేవారని, ఆయన ఉపన్యాస వాగ్ఝరిలో మునిగిపోయేవారని ఈనాటికీ గోదావరీ తీరంలో పట్టణాల్లోనే కాకుండా అనేక గ్రామాల్లో సైతం చాలా గౌరవంగా చెబుతారు.

ఆ వైభవం దిగంతాలకు వ్యాపించేలా ఆయన పెద్ద కుమారుడు ‘ఉషశ్రీ’ రేడియో ప్రసార మాధ్యమం కేంద్రంగా ప్రతీ ఆదివారం చెప్పిన రామాయణ భారత భాగవతాల శబ్ద వైభవం తీరే వేరు. ఆదివారం మధ్యాహ్నం పన్నెండుగంటలకు ఆయన రేడియోలో రామాయణ ప్రవచన చెబుతుంటే ఆరోజుల్లో వేలకొలది శ్రోతలు రేడియోకి చెవులు అతికించి మరీ వినేవారు. ఉషశ్రీ గారు మాట్లాడుతుంటే శ్రోతలు పులకించిపోయేవారన్నది నిజమైన మాటగా చెప్పాల్సిందే. భద్రాచల సీతారాముల కల్యాణానికి వ్యాఖ్యానం చెప్పాలంటే ఆరోజుల్లో ఒక్క ఉషశ్రీయే చెప్పాలి. శ్రీరామనవమికి భద్రాచలంలో ఉషశ్రీ శబ్దం వినిపిస్తే.. కళ్లముందు సీతారాముల కళ్యాణం సాక్షాత్కరించేది.

ఇక రామమూర్తిగారి రెండవ కుమారుడు పురాణపండ రాధాకృష్ణమూర్తి జీవనం ప్రాతఃస్మరణీయమైనది. రాధాకృష్ణమూర్తి గారిది ఉపాసనా దృష్టి. రాధాకృష్ణమూర్తి గారిది పరమ గంభీరమైన సమ్మోహన రూపం మాత్రమే కాకుండా ఆయన మాట్లాడుతుంటే ఒక ఆధ్యాత్మిక శక్తి తరంగాల ప్రసరణ ఎదుటివారికి గొప్ప అనుభూతిని కలిగించి తీరుతుందని ఈనాటికీ తెలుగునాట అనేకమంది ఆయన శిష్యపరంపరలోని వ్యక్తులు, ఎందరెందరో పండిత ప్రకాండులు, మరీ ముఖ్యంగా ఉభయ రాష్ట్రాలలోని ఎన్నో దేవాలయాలకు చెందిన ధర్మకర్తలు, వేదపండితులు, అర్చక బృందాలు స్పష్టంగా చెబుతారు. ఉభయసంధ్యలలో రాధాకృష్ణమూర్తిగారు చేసే ప్రార్ధన, అనుష్టాన వైఖరీ విశేషాలు దేశాల ఎల్లలు దాటడంతో ఎందరెందరో తెలుగువారు ఆయన వద్దకు మంత్రోపదేశం పొందటానికి వచ్చేవారని ఆశ్చర్యంగా చెబుతారు. అలా వచ్చిన వారిలో నాటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు, ఈనాడు రామోజీరావు భార్య రమాదేవి, రామోజీరావు కుమారుడు కిరణ్ వంటి వారే కాకుండా ఎందరో ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు, న్యాయమూర్తులు, పలువురు సినీనటులు, పారిశ్రామిక వేత్తలు ఉండటం గమనార్హం. రాధాకృష్ణమూర్తిగారు చూపించే ఆప్యాయత, అభిమానం వెలకట్టలేమని, ఆయన అజాతశత్రువని ఇప్పటికీ గోదావరీ తీరమంతా చెప్పటం.. కన్నులముందే మహోజ్వల ఘట్టంగానే పరిగణించక తప్పదు.

Puranapanda-Father.jpg

రాధాకృష్ణమూర్తి శ్రీరామరక్షాస్త్రోత్రం చదువుతుంటే సాక్షాత్తు హనుమంతుడుప్రక్కన వినేవాడిని, హనుమంతుడు ఈయన కుటుంబానికి అన్నీ సమకూర్చేవాడని ఈనాటికీ చెబుతారు. రాధాకృష్ణమూర్తిగారి ఉపాసన అంతటి గొప్పది కాబట్టే... ఆయన శివైక్యం చెంది దశాబ్దం దాటినా ఈనాటికీ ఆయన గ్రంధాలకు డిమాండ్ తగ్గలేదు.

రాధాకృష్ణమూర్తి కుమారుడే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో... లక్షలకొలది హిందూ కుటుంబాలలో అమోఘ గ్రంథ రచనలతో, సంకలనాలతో పవిత్ర సంచలనం సృష్టిస్తున్న పురాణపండ శ్రీనివాస్.

శ్రీనివాస్ గ్రంథ రచనాశైలికి వేలల్లో అభిమానులున్నారనేది మన కనులముందు కనిపించే సత్యం. మార్కెట్‌లో ఎక్కడా కనిపించని పురాణపండ శ్రీనివాస్ గ్రంధాలు వందల ఆలయాల్లో, వేదపాఠశాలల్లో, పారాయణాల మండళ్లలో అద్భుత పరిమళాల్ని వెదజల్లుతున్నాయి.

ఈ దేశ హోంశాఖామంత్రి అమిత్ షా మొదలు గత ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, వై.ఎస్ .రాజశేఖరరెడ్డి, కొణజేటి రోశయ్య, జగన్మోహన్ రెడ్డి, కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు వంటి ఐదుగురు ముఖ్యమంత్రులు ఒక్కొక్క సందర్భంలో శ్రీనివాస్ బుక్ ఆవిష్కరించినా శ్రీనివాస్ ఈ రాజకీయ యోధులకంటే దైవానికి ప్రాధాన్యత ఇవ్వడం మనల్ని ఆశ్చర్య పరుస్తుంది.

అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా అందించిన మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్ ‘ఆర్.ఆర్.ఆర్’ భారతీయ చలన చిత్ర రికార్డులను బద్దలు కొట్టుకుంటూ దూసుకుపోయి ఆస్కార్ కైవసం చేసుకుని, కోట్ల మనసుల్ని కొల్లగొట్టిన విషయం ప్రపంచమంతటా తెలుసున్న విషయమే. అయితే ఈ చిత్రం వెండితెరపై పడగానే ప్రత్యేక కృతజ్ఞతలంటూ మొదట కనిపించే ఫోటో పురాణపండ శ్రీనివాస్‌దే.

ఇదేమైనా మామూలు విషయమా ?! శ్రీనివాస్ నిస్వార్ధ సేవకు, నిష్కపటమైన మనస్సుకూ, నిరంతరం శ్రమించే తత్వానికి, యజ్ఞభావనకూ, అసాధారణ ప్రతిభకు దైవం రాజమౌళి రూపంలో యిచ్చిన కానుకని చెప్పాలి. ఎంతో ప్రతిభ వున్న పురాణపండ శ్రీనివాస్ జీవితం కూడా అసూయాపరుల వేధింపులతో కొన్నేళ్లు నలిగిపోయిందని.. అయినా శ్రీనివాస్ మేధ, ప్రతిభ చెక్కు చెదరకపోవడం కేవలం దైవబలమేనని సన్నిహితులే చెబుతారు.

Ushasri.jpg

‘‘మహా మంత్రస్య, యుగే యుగే, జయం జయం, స్మరామి ... స్మరామి, పాహి రామప్రభో, అమ్మణ్ణి, నేనున్నాను, నన్నేలు నాస్వామి, మహా సౌందర్యం, శ్రీపూర్ణిమ, శ్రీమాలిక, జయజయోస్తు, దుర్గే ప్రసీద, శరణు ... శరణు, నను గన్న నాతండ్రి, శంకర ... శంకర, హరోం హర, హరే .. హరే’’... వంటి ఎన్నో ఎన్నెన్నో గుండెకు హత్తుకునేలా గ్రంధాలు ఇట్టే ఆకట్టు కుంటాయి. ఇలాంటివి వందకు పైగానే గ్రంథ రకాలు కనిపిస్తాయి. భారతదేశ చరిత్రలో ఒక తెలుగు వ్యక్తి ఇన్ని సవాళ్ల మధ్య పరమాద్భుత గ్రంథ సేవను, ఇంత నిస్వార్ధంగా సేవ చెయ్యడం ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది.

ఆడంబరాలకు, హోదాలకు దూరంగా... దైవీయ చైతన్యానికి దగ్గరగా జీవించే శ్రీనివాస్‌కి ఎందరో ఐఏఎస్‌లు, ఐ పి ఎస్‌లు, న్యాయమూర్తులు , సినీ ప్రముఖులు, రెండురాష్ట్రాలకు చెందిన కొందరు మంత్రులు, వివిధ పార్టీల నేతలు ఇచ్చే ప్రోత్సాహం చూస్తే అంతా ఆశ్చర్యపోతారు.

మంత్రసమూహాల పట్ల శ్రీనివాస్ చూపే భక్తి, ప్రార్ధనకి ఇచ్చే ప్రాధాన్యం చూస్తే.. ప్రతి ఒక్కరికీ ఆయన బుక్స్ మీద గౌరవం పెరగటమే కాకుండా, ఆయన ప్రవర్తన వల్ల అందరిలో కూడా మార్పు వస్తుందని తెలిసిపోతుంది.

ఎవ్వరినుండీ ఏదీ ఆశించకుండా, ఎప్పుడూ దైవాన్ని మాత్రమే ఆశ్రయించే పురాణపండ శ్రీనివాస్ కీర్తి పట్ల ఆసక్తి చూపకపోవడం వల్లనే దైవ బలం ఆయన వెంట నడుస్తోందని సన్నిహితులు పదిసార్లు చెబుతారు. అసాధారణ వక్త. అద్భుత ఉపన్యాసకులు అయినా పురాణపండ శ్రీనివాస్ లోక కళ్యాణ కారకంగా స్థాపించిన ‘జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం’ అద్భుతమైన పారమార్ధిక ప్రచురణలతో దశాబ్దంన్నరగా అద్వితీయ సేవలందిస్తోందని తిరుమల తిరుపతి దేవస్థానం, రామకృష్ణ మఠం వంటి ఆధ్యాత్మిక భావజాల సంస్థల ప్రచురణ శాఖలు సైతం ప్రశంసలు వర్షించడం గమనార్హం.

అయితే దైవ బలమే అనుగ్రహంగా, తరతరాల మహావిశ్వాసంతో అంతర్జాతీయ తెలుగు సమాజానికి సుమారు వందేళ్ల పైబడి ఆధ్యాత్మిక సేవలో తరిస్తున్న పురాణపండ వారి వంశంలో పురాణపండ శ్రీనివాస్ తరువాత ఎవ్వరూ ఇలా ధార్మిక గ్రంధాల ఉపాసనా చైతన్యంతో తరించి సామాజిక జీవనానికి ఇంత విస్తృతంగా అద్భుత సేవ చేసేవారు లేకపోవడం దురదృష్టమే మరి.

తాత తండ్రులను మించి శ్రీనివాస్ లక్షలమందికి పవిత్ర మంత్ర చైతన్యాన్ని పంచాడనేది కనిపిస్తున్న సత్యం. శ్రీనివాస్‌తో మాట్లాడుతుంటే ఎన్ని అద్భుతాలు సత్యంగా గుండెకు తాకుతాయో, ఎంతటి వాక్చాతుర్యమో అందరికీ ఆశ్చర్యంతో పాటు ఆనందమూ పొంగుతుంది. పురాణపండ వారింట ఎందరు వున్నా శ్రీనివాస్ విశాలదృక్పధం, అందరికీ మేలుకోరే గుణం, అద్భుత గ్రంథాల వెలుగులు... న భూతొ న భవిష్యత్.

ajeyakallam.jpg

‘ఏదో ఒక దైవీయ శక్తి పురాణపండ శ్రీనివాస్‌ను కూడా సంచరించి సంరక్షిస్తోంది’... అనేది సన్నిహితంగా వుండే విజ్ఞులు, అనుభూతి చెందిన రసజ్ఞులు కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. ‘అహంకార మమకారాలకు దూరం కాబట్టే ఇవన్నీ సాధ్యమంటున్నారు’ పురాణపండ శ్రీనివాస్ గురించి సీనియర్ ఐఏఎస్ అధికారి రమణాచారి వంటి పెద్దలు .

ఏదేమైనా పురాణపండ శ్రీనివాస్ తరువాత ఇక పురాణపండ వారింట ఇలాంటి పవిత్ర జ్వాల మరొకటి దర్శనమిచ్చేలా లేకపోవడం తెలుగు భక్త ప్రపంచానికి నిస్సందేహంగా లోటే. పురాణపండ వారి వంశంలో పురాణపండ శ్రీనివాస్‌లా సవాళ్లెదుర్కొన్నవారూ లేరు. శ్రీనివాస్‌లా వున్నత శిఖరాలెక్కిన వారూ లేరు.

శ్రీనివాస్ జీవన లక్ష్యం మాత్రం పరమాత్మ కారుణ్యాన్ని పొందడమే. ప్రతికూల శక్తులు కూడా శ్రీనివాస్ జీవితాన్ని చూస్తే అనుకూలంగా మారిపోతాయి. అనుమానం లేదు. శ్రీనివాస్ అద్భుతాలతో మరొక కొన్నేళ్లు అపురూపంగా నడిచాక, ఆ తరువాత ఎవరూ ఇలాంటి ప్రతిభా మూర్తులు లేక పురాణపండ వారి వంశంలో ఒక మహాద్భుత పారమార్ధిక చైతన్యానికి తెరపడబోతోందని తెలిస్తే విచారం కలుగక మానదని పండిత సమూహాలు వేదనల్ని పొగిస్తున్నాయి.

‘ఒక్కటి మాత్రం నిజం ... పురాణపండ శ్రీనివాస్ మంచి మనస్సు, అవిశ్రాన్త కృషి, అసాధారణ ప్రజ్ఞ ముప్పేటల్లా ఎక్కడో కానీ కనిపించదు’ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్న మాట నూటికి నూరుశాతం సత్యం.

తెలుగు రాష్ట్రాలలో సినీ రాజకీయ సాహితీ సాంస్కృతిక కళా రంగాలకు చెందిన డెబ్భై శాతం ప్రముఖుల గృహాల పూజా పీఠాల్లో పురాణపండ శ్రీనివాస్ మహిమోపేత గ్రంధాలకే అగ్ర తాంబూలమని విఖ్యాత సినీ నటులు కోట శ్రీనివాసరావు విలక్షణ వాక్కులు సత్యమనేది విభిన్న సిద్ధాంతాలవారు కూడా ముక్తకంఠంతో అంగీకరించే సత్యం.

ఇప్పుడు పురాణపండ వారి కుటుంబాల్లో చాలామంది సాఫ్ట్ వేర్ బాట, కొందరు ఉద్యోగాల బాట పట్టడంతో... పురాణేతిహాస వైభవ విశేషాల్ని, మంత్ర, స్తోత్ర విశిష్టతల్ని ఆధునికులకు అవసరమైన రీతిలో అందించడంలో అందెవేసిన చెయ్యి శ్రీనివాస్ తర్వాత... ఇక ముందడుగు వేసే వ్యక్తి లేకపోవడం నిజంగానే దురదృష్టంగానే చెప్పక తప్పదు.

Updated Date - Jun 08 , 2024 | 01:12 AM