Home » Puranapanda Radhakrishna Murthy
పురాణపండ రాధాకృష్ణమూర్తి యజ్ఞమయ సంకల్పం బలమైనది కాబట్టే ఆయన కుమారుడు, ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయధర్మాదాయశాఖ ఆధికారిక మాసపత్రిక ‘ఆరాధన’ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ తన తండ్రి మహదాశయాన్ని సరిక్రొత్త పుంతలు తొక్కిస్తూ తెలుగు రాష్ట్రాల ఆలయాల్ని, పీఠాల్ని, మఠాల్ని, వేదపాఠశాలల్ని శ్రీరామరక్షాస్తోత్రమ్ అఖండ మగలా స్తోత్ర వైభవ ప్రచారంతో, ఉచిత పంపిణీతో చుట్టేస్తున్నారు.
అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా అందించిన మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ భారతీయ చలన చిత్ర రికార్డులను బద్దలు కొట్టుకుంటూ దూసుకుపోయి ఆస్కార్ కైవసం చేసుకుని, కోట్ల మనసుల్ని కొల్లగొట్టిన విషయం ప్రపంచమంతటా తెలుసున్న విషయమే. అయితే ఈ చిత్రం వెండితెరపై పడగానే ప్రత్యేక కృతజ్ఞతలంటూ మొదట కనిపించే ఫోటో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌దే. ఇదేమైనా మామూలు విషయమా? శ్రీనివాస్ నిస్వార్ధ సేవకు, నిష్కపటమైన మనస్సుకూ, నిరంతరం శ్రమించే తత్వానికి, యజ్ఞభావనకూ, అసాధారణ ప్రతిభకు దైవం రాజమౌళి రూపంలో యిచ్చిన కానుకని చెప్పాలి.
ఈ సంవత్సరం భద్రాద్రిలో జరిగే శ్రీరామనవమి సీతారాముల కళ్యాణోత్సవంలో సుమారు ముప్పైవేల శ్రీరామరక్షా స్తోత్రమ్ ప్రతులు కళ్యాణోత్సవంలో పాల్గొనే దంపతులకు, ఉభయదాతలకు, భక్తులకు అందజేయనున్నట్లు ఇప్పటికే శ్రీ సీతారామ చంద్ర దేవస్థాన జాయింట్ కమీషనర్, ముఖ్య కార్యనిర్వహణాధికారిని శ్రీమతి ఎల్. రమాదేవి ప్రకటించారు.
ఒక వైపు లోకోత్తర లావణ్యం, మరొక వైపు రణకర్కశ రౌద్రం నిండిన ధర్మావతారమైన శ్రీరామచంద్రుని కీర్తించి మహా మహా విజయాలను పొందే అద్భుత శ్రీరామరక్షాస్తోత్రాన్ని ఈసారి భద్రాద్రి శ్రీరామనవమి ఉత్సవాలలో వేలాది భక్తులకు ఉచితంగా పంచే భాగ్యాన్ని ప్రసాదించిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం ధార్మిక సేవను శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం డిప్యూటీ కలెక్టర్ శ్రీమతి ఎల్. నాగమణి అభినందించారు.
ఈ సారి శ్రీ సీతారామచంద్ర దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి ఎల్. రమాదేవి సమర్ధ సేవలతో ప్రత్యేక శోభతో విరాజిల్లనున్న భద్రాద్రి కళ్యాణవేదిక సాక్షిగా ‘శ్రీరామరక్షా స్తోత్రం’ గ్రంధం భక్త పాఠకులను అలరించబోతోంది.
ఎన్నో ఉద్విగ్నవేళల్ని, ఆపదలను తరిమి... అద్భుతాలను ప్రసాదించే ఈ శ్రీరామరక్షాస్తోత్రాన్ని ఈ శ్రీరామ నవమి కానుకగా వారాహి చలన చిత్రం అధినేత, శివవారాహీ ట్రస్ట్ చైర్మన్ , శ్రీ అమృతేశ్వరస్వామి దేవాలయం సంస్థాపకుడు సాయి కొర్రపాటి భద్రాచలం శ్రీరామనవమి వేడుకకు విచ్చేసే వేలాది భక్తులకు ఉచితంగా అందజేసే సదుద్దేశంతో సుమారు యాభైవేల ప్రతులను భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంకి అందజేయనున్నారు.