Share News

Allu Arjun: నాకు ఏ పార్టీతో సంబంధం లేదు..నా వాళ్లకు సపోర్ట్ చేస్తా

ABN , Publish Date - May 13 , 2024 | 08:14 AM

దేశవ్యాప్తంగా 2024 లోక్‌సభ ఎన్నికల(loksabha elections 2024) నేపథ్యంలో నేడు నాలుగో దశలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 96 సీట్లకు ఓటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్(hyderabad) జూబ్లీహిల్స్‌లో అల్లు అర్జున్(Allu Arjun) ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Allu Arjun: నాకు ఏ పార్టీతో సంబంధం లేదు..నా వాళ్లకు సపోర్ట్ చేస్తా
Allu Arjun hyderabad voting

దేశవ్యాప్తంగా 2024 లోక్‌సభ ఎన్నికల(loksabha elections 2024) నేపథ్యంలో నేడు నాలుగో దశలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 96 సీట్లకు ఓటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్(hyderabad) జూబ్లీహిల్స్‌లో అల్లు అర్జున్(Allu Arjun) ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన క్రమంలో స్టార్ హీరో నంద్యాల వెళ్లిన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.


తనకు ఏ పార్టీతో సంబంధం లేదని, నా అనుకునే వాళ్లకు తప్పకుండా సపోర్ట్ చేస్తానని అల్లు అర్జున్(Allu Arjun) స్పష్టం చేశారు. ఈ క్రమంలో నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా కూడా వారికి వ్యక్తిగతంగా మద్దతు ఇస్తానని చెప్పారు. ఆ క్రమంలో మా అంకుల్ పవన్ కల్యాణ్ అయినా, నా ఫ్రెండ్ రవిచంద్ర గారు లేదా మా మావయ్య చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు లేదంటే మా బన్నీ వాసు అయినా కూడా సపోర్ట్ చేస్తానని వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్‌రెడ్డి 15 ఏళ్లుగా తనకు ఫ్రెండ్ అని అల్లు అర్జున్ తెలిపారు. ఆ క్రమంలోనే రవి పాలిటిక్స్‌లోకి వస్తే తప్పకుండా మీ ఊరు వచ్చి సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చానని, అందుకోసమే తన భార్యతో కలిసి వెళ్లి రవికి విషెస్ తెలిపినట్లు చెప్పారు.


శనివారం అల్లు అర్జున్ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. దీని తరువాత అల్లు అర్జున్‌పై నంద్యాల(nandyal) జిల్లాలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారం కోసం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్‌రెడ్డి నివాసానికి అల్లు అర్జున్ చేరుకున్నారని, దీంతో అక్కడ జనాలు గుమిగూడారని పోలీసులు చెబుతున్నారు. ఎఫ్‌ఐఆర్‌లో ఎమ్మెల్యే పేరు కూడా ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మహిళా పోలీసులకు విధులు

వైసీపీ.. నాడు ధీమా.. నేడు డీలా!

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 13 , 2024 | 08:16 AM