Share News

Bhadrachalam : గర్భిణికి పురుడు పోసిన ఎమ్మెల్యే తెల్లం

ABN , Publish Date - Jul 24 , 2024 | 04:00 AM

ప్రసవ వేదనతో ఓ గర్భిణి ఆస్పత్రి రావడం.. అక్కడ సర్జన్‌ అందుబాటులోలేకపోవడంతో స్వయంగా వైద్యుడైన స్థానిక ఎమ్మెల్యేనే సిజేరియన్‌ చేసి బిడ్డను కుటుంబసభ్యుల చేతుల్లో పెట్టారు.

 Bhadrachalam : గర్భిణికి పురుడు పోసిన ఎమ్మెల్యే తెల్లం

భద్రాచలం, జూలై 23: ప్రసవ వేదనతో ఓ గర్భిణి ఆస్పత్రి రావడం.. అక్కడ సర్జన్‌ అందుబాటులోలేకపోవడంతో స్వయంగా వైద్యుడైన స్థానిక ఎమ్మెల్యేనే సిజేరియన్‌ చేసి బిడ్డను కుటుంబసభ్యుల చేతుల్లో పెట్టారు. అత్యవసర పరిస్థితుల్లో శస్త్రచికిత్స చేసి తల్లి, బిడ్డల ప్రాణాలను కాపాడిన ఆ వైద్యుడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.

భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి సోమవారం సాయంత్రం దుమ్ముగూడెం మం డలం రేగుబల్లికి చెందిన బేరిబోయిన స్వప్న అనే గర్భిణి రెండో కాన్పుకోసం వచ్చింది. మంగళవారం ఉదయం ఆమెకు పురుటినొప్పులొచ్చాయి. సిజేరియన్‌ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. కొన్నాళ్లుగా అక్కడ సర్జన్‌ ఎవరూలేరు. అయితే స్వప్న కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే వెంకట్రావుతో పరిచయం ఉండడంతో వారు ఆయనకు ఫోన్‌ చేశారు. వెంటనే ఎమ్మెల్యే భద్రాచలం ఏరియా వైద్యశాలకు వెళ్లి స్వప్నకు సిజేరియన్‌ చేశారు. ఎమ్మెల్యేకు ఆమె కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jul 24 , 2024 | 04:00 AM