Share News

TG Politics: కేసీఆర్‌ను మించిన నియంతలా రేవంత్

ABN , Publish Date - Nov 18 , 2024 | 05:46 PM

లగచర్లలో పర్యటించేందుకు మహబూబ్ నగర్ ఎంపీ, బీజేపీ నేత డీకే అరుణ సోమవారం ప్రయత్నించారు. అయితే ఆమె ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

TG Politics: కేసీఆర్‌ను మించిన నియంతలా రేవంత్
BJP MP DK Aruna

హైదరాబాద్, నవంబర్ 18: వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో జిల్లా కలెక్టర్‌పై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి.. ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సోమవారం లగచర్లకు వెళ్లేందుకు యత్నించిన మహాబూబ్‌నగర్ ఎంపీ, బీజేపీ నాయకురాలు డీకే అరుణను రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా పోలీసుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana: కొణతం దిలీప్ అరెస్ట్.. ఖండించిన హరీశ్ రావు


తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? చచ్చిపోయిందా? అంటూ పోలీసులపై మండిపడ్డారు. ఒక ఎంపీగా తన సొంత నియోజకవర్గంలో పర్యటించ నివ్వరా? అంటూ పోలీసులను ఆమె నిలదీశారు. ఇక పోలీసులు అనుసరిస్తున్న వైఖరిని బీజేపీ నేతలు ఖండించారు. పోలీసుల జులుం నశించాలంటూ వారు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇదేం దౌర్జన్యమంటూ పోలీసులను డీకే అరుణ సూటిగా ప్రశ్నించారు. ఇదేమైనా కొండగల్ రేవంత్ రెడ్డి జాగిరా.. అంటూ పోలీసులను ఆమె నిలదీశారు. ఎక్కడి నుంచో వచ్చి.. ఇక్కడ తమ రైతులను కొడుతున్నారని ఈ సందర్భంగా డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: బీజేపీ అంటే ఏంటో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చూపిస్తాం


ఇక మిస్టర్ రేవంత్ రెడ్డి.. కొండగల్ ఒక్క నియోజక వర్గానికే తాను ఎంపీ కాదని ఆమె స్పష్టం చేశారు. సొంత నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకో లేక.. తనను ఆపుతావా? అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ డీకే అరుణ నిప్పులు చెరిగారు. ఈ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని ఆరోపించారు. మిస్టర్ రేవంత్ రెడ్డి.. నీ జులు ఇక్కడ సాగదు ఖబడ్డార్ అంటూ సవాల్ విసిరారు.
Also Read: డ్రామాలు కట్టిపెట్టి.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండి


ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తానంటే సాగదని స్పష్టం చేశారు. నీకు అంత దమ్ము ఉంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసి.. కొడంగల్‌లో పోటీ చేయి.. ఎన్నికలకు రా చూసుకుందామంటూ సీఎం రేవంత్‌కు ఎంపీ డీకే అరుణ్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో కేఆర్‌ను మించిన నియంతలా రేవంత్ తయారయ్యారంటూ ఆమె మండిపడ్డారు.

Also Read: నిమ్మకాయలతో ఇన్ని లాభాలున్నాయా..?

For Telangana news And Telugu News

Updated Date - Nov 18 , 2024 | 05:46 PM