Share News

Airport: శంషాబాద్‌లో 9 విమానాలకు బెదిరింపులు

ABN , Publish Date - Oct 31 , 2024 | 04:17 AM

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి పలు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

Airport: శంషాబాద్‌లో 9 విమానాలకు బెదిరింపులు

  • బాంబ్‌ స్క్వాడ్లతో తనిఖీలు.. ఏమీ లేవని తేల్చిన సిబ్బంది

శంషాబాద్‌ రూరల్‌, అక్టోబరు 30 (ఆంధ్ర‌జ్యోతి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి పలు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళ, బుధవారాల్లో మొత్తం 9 విమానాలకు ఫోన్‌, ఈమెయిల్‌, ఎక్స్‌ ద్వారా గుర్తుతెలియని దుండగుల నుంచి బెదిరింపులు వచ్చాయి. వీటిలో చెన్నై, అయోధ్య, ఢిల్లీ, యూకేల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో, ఎయిరిండియా సంస్థలకు చెందిన విమానాలున్నాయి.


అప్రమత్తమైన సీఐఎ్‌సఎఫ్‌, సీఆర్పీఎఫ్‌ బలగాలు డాగ్‌, బాంబ్‌స్క్వాడ్‌ తనిఖీలు నిర్వహించి ఎలాంటి బాంబులు తేవని తేల్చారు. గుర్తుతెలియని వ్యక్తులు విదేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి బెదిరింపు మెయిల్స్‌, కాల్స్‌ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. కొందరు దుండగులు ఎక్స్‌ ద్వారా నకిలీ హెచ్చరికలు పంపుతున్నారన్నారు.

Updated Date - Oct 31 , 2024 | 04:17 AM