Share News

Breaking News: నేటి తాజా వార్తలు..

ABN , First Publish Date - Nov 21 , 2024 | 07:48 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

 Breaking News: నేటి తాజా వార్తలు..
Breaking News

Live News & Update

  • 2024-11-21T13:02:02+05:30

    అదానీని అరెస్ట్ చేయాలి: రాహుల్ గాంధీ

    • ఢిల్లీ: అదానీని అరెస్ట్ చేయాలి: రాహుల్ గాంధీ డిమాండ్

    • సెకీ ఒప్పందాల్లో జరిగిన అవినీతిని బయట పెట్టాలి

    • అదానీని అరెస్ట్ చేసి విచారిస్తే సెకీ అక్రమాలు బయటపడతాయి

    • ఇండియాలో అన్ని ప్రధాన ప్రాజెక్టులు అదానీకే ఎలా దక్కుతున్నాయి: రాహుల్ గాంధీ

    • అసలు అదానీని అరెస్ట్ చేసే ధైర్యం ప్రధాని మోదీకి లేదు:రాహుల్

  • 2024-11-21T11:47:43+05:30

    కాగ్ చీఫ్‌గా కే సంజయ్ మూర్తి ప్రమాణం

    • ఢిల్లీ: కంప్ట్రోలర్ అండ్ అడిటర్ (కాగ్) జనరల్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి కే సంజయ్ మూర్తి ప్రమాణం

    • కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్‌గా 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంజయ్ మూర్తి నియామకం

    • ఆంధ్రప్రదేశ్‌లో గల అమలాపురంకు చెందిన సంజయ్ మూర్తి

    • 1989లో హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా కెరీర్ ప్రారంభం

    • కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పని చేస్తోన్న సంజయ్ మూర్తి

    • కాగ్ చీఫ్‌గా నియమిస్తూ సోమవారం నోటిఫికేషన్ ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ

    • కాగ్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన సంజయ్ మూర్తి.

  • 2024-11-21T11:40:32+05:30

    కీలక భేటీ

    • హైదరాబాద్: గాంధీ భవన్‌కు ప్రొఫెసర్, ఎమ్మెల్సీ కోదండరాం

    • పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌తో కోదండరాం భేటీ

  • 2024-11-21T08:01:16+05:30

    • భూ కబ్జా వివాదంలో బీఆర్ఎస్ నేత

    • వరంగల్: భూ కబ్జా వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్

    • హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

    • హంటర్ రోడ్డు వినాయక నగర్ రోడ్డు 1 దుర్గా దేవి కాలనీలో ఆక్రమణకు యత్నం

    • 500 గజాల స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం

    • స్థల యజమానులకు చెందిన కంటైనర్‌, ఇంట్లోని వస్తువులు దొంగలించారని శంకర్ నాయక్‌పై కేసు

    • బాధితులపై దాడి చేసి, సెల్ ఫోన్లు లాక్కున్నారని శంకర్ నాయక్‌పై ఆరోపణలు

  • 2024-11-21T07:52:04+05:30

    • హైదరాబాద్‌కు కాళేశ్వరం కమిషన్ చైర్మన్

    • హైదరాబాద్: ఈ రోజు హైదరాబాద్‌కు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ఘోష్.

    • ఎల్లుండి నుంచి కాళేశ్వరంపై తిరిగి విచారణ

    • మొదట ఐఏఎస్, మాజీ ఐఏఎస్‌ల విచారణ

    • ఈ సారి విచారణలో కీలక పరిణామం జరిగే అవకాశం

    • ఈ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటి వారంలో మాజీ సీఎం కేసీఆర్‌ను విచారణకు పిలిచే అవకాశం

    • కేసీఆర్ సూచనల మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పిన అధికారులు.

  • 2024-11-21T07:48:25+05:30

    ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.