Share News

Basara IIIT: విద్యార్థి మృతి ఘటనలో ఐఐఐటీ అధికారులపై కేసు

ABN , Publish Date - Nov 14 , 2024 | 04:41 AM

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి స్వాతిప్రియ ఆత్మహత్య ఘటనలో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ రణధీర్‌, డీన్‌లు పావని, నాగరాజ్‌, కేర్‌ టేకర్‌ స్రవంతిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.

Basara IIIT: విద్యార్థి మృతి ఘటనలో ఐఐఐటీ అధికారులపై కేసు

బాసర, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి స్వాతిప్రియ ఆత్మహత్య ఘటనలో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ రణధీర్‌, డీన్‌లు పావని, నాగరాజ్‌, కేర్‌ టేకర్‌ స్రవంతిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. అదేవిధంగా స్వాతిప్రియపై వేధింపులకు కారణమైన ఇద్దరు విద్యార్థులపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మొదటి నుంచి ఇద్దరు విద్యార్థుల వేధింపుల వల్లే స్వాతిప్రియ ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వాతిప్రియ సూసైడ్‌ లెటర్‌లో మాత్రం ఎవరి పేర్లు లేకపోవడంతో.. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకుందని అధికారులు చెబుతూ వస్తున్నారు. కాని అధికారులపై కేసు నమోదుతో స్వాతిప్రియ ఆత్మహత్య ఘటన కొత్త మలుపు తిరిగింది. మరోవైపు, బుధవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ అవినాష్‌ కుమార్‌ బాసర ట్రిపుల్‌ ఐటీని సందర్శించారు. ట్రిపుల్‌ ఐటీ అధికారులపై కేసు నమోదు చేసిన విషయం వాస్తవమేనని బాసర ఎస్సై తెలిపారు.

Updated Date - Nov 14 , 2024 | 04:41 AM