Share News

Chicken: చికెన్ ధరలకు రెక్కలు..!

ABN , Publish Date - Dec 01 , 2024 | 05:20 PM

కార్తికమాసం వెళ్లిపోయింది. చికెన్ ధరలకు రెక్కలు రానున్నాయి. ఇప్పటికే కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి.

Chicken: చికెన్ ధరలకు రెక్కలు..!

సాధారణంగా కార్తికమాసం ప్రారంభం కాగానే.. చికెన్ ధరలు తగ్గిపోతాయి. హిందువుల్లో చాలా మంది పూజలు, ఉపవాసాలు ఉండడం వల్ల.. మాంసాహారం వైపు వెళ్లారు. దీంతో నాన్ వేజ్ డిమాండ్ బాగా తగ్గిపోతుంది. దీంతో వాటి ధరలు అమాంతంగా పడిపోతాయి. అయితే డిసెంబర్ 01వ తేదీతో కార్తిక మాసం వెళ్లిపోతుంది.

Also Read: పోలి పాడ్యమి రోజు.. ఇలా చేస్తే..


ఇక డిసెంబర్ 02వ తేదీ పోలి స్వర్గానికి వెళ్లిన రోజు. దీంతో డిసెంబర్ 03వ తేదీ నుంచి చికెన్ ధరలకు రెక్కలు రానున్నాయి. నిన్న మొన్నటి వరకు తక్కవ ధర ఉన్న చికెన్ మరి కొన్ని గంటల నుంచి భారీగా పెరగనుంది. ప్రస్తుతం చికెన్ కిలో ధర రూ. 270గా ఉంది. డిసెంబర్ 3వ తేదీ నుంచి దీని ధర రూ.350 నుంచి రూ.400 వరకు చేరే అవకాశముంది. ఇక కోడిగుడ్ల ధర అయితే ఇప్పటికే భారీగా పెరిగింది.

Also Read : తీరం దాటిన ఫెంగల్ తుఫాన్.. ఏపీలో భారీ వర్షాలు


ఎందుకంటే..

కార్తికమాసం వెళ్లిపోయింది. మార్గశిర మాసంలో వివాహ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే క్రిస్మస్ పండగ, కొత్త ఏడాది సందర్భంగా భారీగా కార్యక్రమాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో చికెన్, మటన్ బిర్యానిలకు భారీ డిమాండ్ ఏర్పడనుంది. ఇక కేకుల తయారీ ఉంటుంది. వాటి తయారీలో కోడిగుడ్లను వినియోగిస్తారు. దీంతో చికెన్, మటన్‌లతోపాటు కోడిగుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Dec 01 , 2024 | 05:26 PM