Share News

Damodara Rajanarasimha: 8 కి.మీ.కు ఒక ఆరోగ్య కేంద్రం

ABN , Publish Date - Oct 29 , 2024 | 04:30 AM

అందరికీ వైద్యం అందాలనే లక్ష్యంతో ప్రతి 8 కి.మీ.కు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

Damodara Rajanarasimha: 8 కి.మీ.కు ఒక ఆరోగ్య కేంద్రం

  • మంత్రి దామోదర రాజనర్సింహ

రేగోడు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): అందరికీ వైద్యం అందాలనే లక్ష్యంతో ప్రతి 8 కి.మీ.కు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సోమవారం మెదక్‌ జిల్లాలో రూ.7 కోట్లతో మంజూరైన బోరంచ నల్లపోచమ్మ ఎత్తిపోతల పథకం అదనపు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే రేగోడు-మర్పల్లి, చౌదర్పల్లి- కొత్వాల్‌పల్లి చెరువులకు సింగూర్‌ జలాలను కాలువల ద్వారా నింపే పనులను ప్రారంభించారు.


అనంతరం మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ మాటను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలబెట్టుకుందని, మిగిలిన వారికి త్వరలోనే రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని చెప్పారు. అందోల్‌ నారాయణ ఖేడ్‌ మధ్యలో రేగోడు మండలంలో ఐటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

Updated Date - Oct 29 , 2024 | 04:30 AM