Share News

Harassment: వాట్సా్‌పలో అసభ్యకర సందేశాలు.. మనస్తాపంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

ABN , Publish Date - Nov 19 , 2024 | 02:44 AM

తెలిసిన ఓ యువకుడు వాట్సా్‌పకు అసభ్యకర మెసేజ్‌లు పంపడంతో మనస్తాపానికి గురై ఓ డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భువనగిరి జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగింది.

Harassment: వాట్సా్‌పలో అసభ్యకర సందేశాలు.. మనస్తాపంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

భువనగిరి టౌన్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలిసిన ఓ యువకుడు వాట్సా్‌పకు అసభ్యకర మెసేజ్‌లు పంపడంతో మనస్తాపానికి గురై ఓ డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భువనగిరి జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగింది. భువనగిరిలోని విద్యానగర్‌కు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు ఎలగందుల సతీ్‌షకు కుమారుడు, కుమార్తె హాసిని(20) ఉన్నారు. హాసిని హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతోంది. భువనిగిరిలో వలిగొండ మండలం టేకుల సోమారానికి చెందిన బీటెక్‌ విద్యార్థి నారగోని నిఖిల్‌తో ఆమెకు రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. నిఖిల్‌ కూడా మేడిపల్లిలో ఉంటూ చదువుకుంటున్నాడు.


అయితే కొద్దిరోజులుగా నిఖిల్‌.. హాసినికి వాట్సా్‌పలో మెసేజ్‌లు పెడుతూ వేధిస్తున్నాడు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను హ్యాక్‌ చేసి ఆమె పేరిట పోస్టులు పెట్టేవాడు. ఈ క్రమంలో సెలవులకు రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చిన హాసినికి అసభ్యకర మెసేజ్‌లు పెట్టాడు. దాంతో మనస్తాపానికి గురైన యువతి ఆదివారం రాత్రి ఉరేసుకుంది. గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే మృతి చెందింది. హాసిని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిఖిల్‌ను అరెస్టు చేసి సోమవారం కోర్టులో హాజరుపరిచారు.

Updated Date - Nov 19 , 2024 | 02:44 AM