ED Custody: ‘సాహితీ’ లక్ష్మీనారాయణకు ముగిసిన ఈడీ కస్టడీ
ABN , Publish Date - Oct 19 , 2024 | 05:13 AM
సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ బి. లక్ష్మీనారాయణకు ఈడీ కస్టడీ ముగిసింది. ప్రపంచస్థాయి విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ నివాస సముదాయాల పేరుతో వందల కోట్లు దారిమళ్లించిన కేసులో లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు సోమవారం కస్టడీలోకి తీసుకున్నారు.
హైదరాబాద్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ బి. లక్ష్మీనారాయణకు ఈడీ కస్టడీ ముగిసింది. ప్రపంచస్థాయి విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ నివాస సముదాయాల పేరుతో వందల కోట్లు దారిమళ్లించిన కేసులో లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు సోమవారం కస్టడీలోకి తీసుకున్నారు. ఐదు రోజుల కస్టడీ గడువు ముగియడంతో శుక్రవారం కోర్టులో హాజరుపర్చిన తర్వాత తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ప్రజల నుంచి సేకరించిన సొమ్ము ఏయే కంపెనీలకు దారిమళ్లించారు, సహనిందితులుగా ఉన్నది ఎవరు, తెరవెనుక ఉన్నది ఎవరు, కొల్లగొట్టిన సొమ్ములో ఎవరి వాటా ఎంత..? ఇలా పలు కీలక ప్రశ్నలకు ఈడీ అధికారులు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఆయన నుంచి సేకరించిన సమాచారం మేరకు త్వరలోనే మరికొందర్ని విచారించేందుకు సిద్ధమవుతున్నారు.