Share News

Hyderabad: రాధాకిషన్‌రావుకు ఎస్కార్ట్‌ బెయిల్‌

ABN , Publish Date - Jun 04 , 2024 | 05:22 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ (ఓఎస్డీ) పొట్లపల్లి రాధాకిషన్‌రావుకు నాంపల్లి కోర్టు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరు చేసింది. తన తల్లి సరోజినీ దేవి (98) సోమవారం మృతిచెందడంతో ఆమె అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతించాలని రాధాకిషన్‌రావు సోమవారం కోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు.

Hyderabad: రాధాకిషన్‌రావుకు ఎస్కార్ట్‌ బెయిల్‌

  • తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కరీంనగర్‌కు..

హైదరాబాద్‌/చిలుపూర్‌/సైదాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ (ఓఎస్డీ) పొట్లపల్లి రాధాకిషన్‌రావుకు నాంపల్లి కోర్టు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరు చేసింది. తన తల్లి సరోజినీ దేవి (98) సోమవారం మృతిచెందడంతో ఆమె అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతించాలని రాధాకిషన్‌రావు సోమవారం కోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ అనంతరం కోర్టు ఆయనకు సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరు చేసింది. దాంతో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయనను పోలీసులు బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనంలో కరీంనగర్‌కు తీసుకెళ్లారు. కాగా, వయోభారం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సరోజినీ దేవి కొంతకాలంగా కరీంనగర్‌లో కుమార్తె వద్ద ఉంటున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం మృతిచెందారు. ఆమె అంత్యక్రియలు స్వగ్రామం జనగామ జిల్లా చిలుపూర్‌ మండలం పల్లగుట్టలో నిర్వహించనున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని చూసేందుకు అనుమతించాలని రాధాకిషన్‌రావు కోరడంతో ఏప్రిల్‌లో కోర్టు ఆయనకు 4 గంటల ప్రత్యేక అనుమతి మంజూరు చేసింది. ఏప్రిల్‌ 21న ఆయన తల్లిని చూసివచ్చారు.

Updated Date - Jun 04 , 2024 | 05:22 AM