Share News

‘పొన్నాల’ గ్రంధాలకు నరసింహన్ పలకరింపు! కేసీఆర్ కోసం ‘పురాణపండ’ మంత్రశక్తుల పరిమళింపు!

ABN , Publish Date - May 04 , 2024 | 11:15 PM

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి రాజకీయ ‘జయోస్తు’ పలకడం కోసం పొన్నాల లక్ష్మయ్య మళ్ళీ పురాణపండ శ్రీనివాస్ చేత అపురూపమైన అద్భుత మహా నారసింహ స్వామి వారి ప్రత్యేక గ్రంధాన్ని రచింపజేయడానికి పురాణపండకు కబురు పెట్టినట్లుగా టీఆర్ఎస్ శ్రేణుల్లో వినబడుతోంది.

‘పొన్నాల’ గ్రంధాలకు నరసింహన్ పలకరింపు! కేసీఆర్ కోసం ‘పురాణపండ’ మంత్రశక్తుల పరిమళింపు!

ఆధ్యాత్మికం, సాహిత్యం, తత్త్వశాస్త్రం, చిత్రకళ అంటే ఎంతో మక్కువ ఉన్న భారతదేశ కేంద్ర మాజీ సీబీఐ ఉన్నతాధికారి, నాటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ తిరుమల, యాదగిరిగుట్ట ఎన్ని సార్లు దర్శనం చేసుకున్నారో... బహుశా ఇ.ఎస్.ఎల్ నరసింహన్ దంపతులకే తెలియనన్ని సార్లు పవిత్ర దర్శనాలు చేసుకున్నట్లు ఆయా మహా పుణ్యక్షేత్రాల రికార్డులను చూస్తే తెలుస్తుంది. ఈ దంపతుల పరమ భక్తికి అధికారులే ఆశ్చర్యపోయేవారు.

నరసింహన్ సుదీర్ఘకాలంపాటు గవర్నర్‌గా అద్భుత సమర్ధ సేవలు అందిస్తున్న తరుణంలో ఒక శ్రావణ పౌర్ణమి ప్రభాతవేళ నాటి ఆంధ్రప్రదేశ్ ఐ.టి.శాఖామంత్రిగా అసాధారణ సేవలు అందిస్తున్న పొన్నాల లక్ష్మయ్యను పిలిచి... ‘‘ఏమండీ లక్ష్మయ్య గారూ... ఈ మధ్య మీరు ప్రచురించిన అపురూపమైన ధార్మిక గ్రంధాల గురించి తిరుమల పండితుల ద్వారా, మా కార్యాలయ సిబ్బంది ద్వారా విన్నాను. చాలా సౌందర్యంగా ప్రచురించారట. మరి మాకివ్వలేదేమిటి? మాకు తెలుగు భాష కొంచం వచ్చిందిగా?’’ అని పొన్నాల వారితో నవ్వుతూ అన్నారుట.

Ponnala-Lakshmaiah.jpg

వెంటనే పొన్నాల లక్ష్మయ్య తాను అపూర్వ సొగసులతో పరమ పవిత్రంగా ప్రచురించిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అద్భుత రచనా సంకలనాలైన నాల్గురకాల కావ్య కథల, మంత్ర వైభవాల గ్రంధాలను నరసింహన్ హస్తాలకు అందించి... ఆయనతో సుమారు గంట సేపు గడిపారు.

ESL-Narasimhan.jpg

బుక్‌లో సంస్కృత శ్లోకాలకు... పురాణపండ శ్రీనివాస్ అందించిన వైభవోపేత వ్యాఖ్యానాలను ప్రక్కనే వున్న తన కార్యాలయ సిబ్బందిలో తెలుగు అనువాదకురాలిచేత వివరంగా చదివించుకుని పరవశించి.. పొన్నాల అద్భుత గ్రంధాలను ప్రచురించారని, గత మూడేళ్ళుగా పురాణపండ శ్రీనివాస్ గ్రంధాలను తాను కూడా మూడు ఆవిష్కరించానని, పురాణపండ శ్రీనివాస్ తెలుగు ఆధ్యాత్మిక వైభవానికి ఒక పతాకంలా ఎప్పుడూ ఉత్సాహంగా రెప రెప లాడుతూంటారని పేర్కొంటూ పొన్నాలను, పురాణపండను నరసింహన్ ప్రత్యేకంగా అభినందించడం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు.

Puranapanda-Srinivas.jpg

ఇటీవల న్యూఢిల్లీలో నరసింహన్ తన స్వగృహంలోని గ్రంధాలయంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృత కావ్యాల, పురాణాల వరుస గ్రంధాల మధ్య పొన్నాల లక్ష్మయ్య, పురాణపండ శ్రీనివాస్‌ల గ్రంధాలను నాలుగింటికి చాలా ప్రాధాన్యతనిచ్చి పెట్టారని నరసింహన్ అనుచరుల సమాచారం. పొన్నాల గ్రంధాల్లో పురాణపండ ప్రచురించిన కొన్ని అరుదైన, అపురూప చిత్రాలంటే నరసింహన్‌కి చాలా ఇష్టమని ఆరోజుల్లోనే గవర్నర్ కార్యాలయ సిబ్బంది పేర్కొన్నట్లు కూడా పొన్నాల అనుచర సహచరులు చెబుతున్నారు.

ఈ గ్రంథ సుగంధాన్ని పురాణపండతో తెలుగు జాతికి పొన్నాల లక్ష్మయ్య సమర్పకునిగా పుష్కర కాలం క్రితం అందించినా... ఈ నాటికీ ఈ మంత్ర విశేషాల్ని మేధో సమాజం ముచ్చటించుకోవడం దైవబలం కాక మరేమిటంటున్నారు తెలంగాణ పండితుల బృందాలు.

KCR-Photo.jpg

మరొక ముఖ్యాంశమేమంటే... ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీగా లక్షలాది ప్రజలు పిలుస్తున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి రాజకీయ ‘జయోస్తు’ పలకడం కోసం పొన్నాల లక్ష్మయ్య మళ్ళీ పురాణపండ శ్రీనివాస్ చేత అపురూపమైన అద్భుత మహా నారసింహ స్వామి వారి ప్రత్యేక గ్రంధాన్ని రచింప చేయడానికి శ్రీశైల దేవస్థానం పూర్వ సలహాదారు పురాణపండ శ్రీనివాస్‌కి తన సన్నిహితుల ద్వారా కబురు పెట్టినట్లు టీఆర్ఎస్ శ్రేణులు బాహాటంగానే చెబుతున్నారు.

Ponnala.jpg

ఈ గ్రంధాన్ని తెలంగాణా అంతటా ఉన్న అన్ని జిల్లాల బీఆర్ఎస్ నాయకులకు, నాయకీమణులకు పొన్నాల లక్ష్మయ్య సమర్పణా భావంతో అందజేయనున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఈ శనివారం కూడా చర్చించుకుంటున్నట్లుగా సమాచారం. ఏది ఏమైనా పురాణపండ శ్రీనివాస్ బుక్స్ ఎంతో పవిత్రంగా, అపురూపంగా, అందంగా, విజయాలకు నికార్సైన సంకేతాలుగా నిలుస్తాయని కొంత కాలంగా రాజకీయ శ్రేణుల్లో బలంగా వినిపిస్తున్న సత్యం. పురాణపండ శ్రీనివాస్ అవిశ్రాంత కృషి, అయన సంకల్పంలో తేజస్సు, మనస్సులో ప్రతిష్ఠితమయ్యే అందమైన భాషా సౌందర్యం, సంఘర్షణలను తొక్కిపెట్టి శుభాలను ప్రసాదించే అంశాలు, అద్భుతంగా ప్రచురించడం... వీటన్నిటికీ మించి అచ్చమైన స్వచ్ఛమైన ధార్మిక సేవను ఆచరణలో చూపించడం వల్లనే పురాణపండ శ్రీనివాస్ బుక్స్‌కి, ఆయనకూ ఇంతటి ఆదరణా... ఆప్యాయతానూ అని అంటున్నాయి బీఆర్ఎస్ గళాలు. ఇకపోతే, పొన్నాల అందించే మహోజ్వల నృసింహ శక్తి కోసం తెలంగాణ అంతటా ఉన్న బీఆర్ఎస్ మహిళా శ్రేణులు సైతం ఎంతో ఆసక్తిని కనబరుస్తుండటం విశేషం.

Updated Date - May 04 , 2024 | 11:15 PM