BiggBoss Season 8: గంగవ్వకు గుండెపోటు..
ABN , Publish Date - Oct 22 , 2024 | 08:13 PM
ప్రస్తుతం బిగ్ బాస్ 8 సీజన్ నడుస్తుంది. ఇందులో వైల్డ్ కార్డు ఎంట్రీతో గంగవ్వ మరోసారి ఈ హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఆ వెంటనే హౌస్‌లో అవినాష్‌తో కలిసి గంగవ్వ ఓ గేమ్ అద్బుతంగా ఆడి.. అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. అలాంటి వేళ గంగవ్వకు హార్ట్ అటాక్ వచ్చిందంటూ ఓ న్యూస్ అయితే సోషల్ మీడియాను చుట్టేస్తుంది. ఆమెకు హార్ట్ అటాక్ రావడంతో బిగ్ బాస్ హౌస్ నిర్వాహాకులు సైతం తీవ్ర ఆందోళన చెందారనే ఓ ప్రచారం సైతం సాగుతుంది.
మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వకు గుండెపోటు వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని మై విలేజ్ షో నిర్వాహకులు మంగళవారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ షోలో ఉన్న గంగవ్వ ఆరోగ్యంపై షో నిర్వాహకులకు కాల్ చేయగా.. అలాంటిదేమీ లేదని వారు చెప్పారన్నారు. గంగవ్వకు గతంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో గంగవ్వ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. గతంలో అంటే.. బిగ్ బాస్ సీజన్ 4లో గంగవ్వ పాల్గొన్న విషయం విధితమే.
Also Read: ఇవి తింటే.. జుట్టు ఊడదు..
Also Read: Viral Video: చిరుతపులిని కవ్వించారు.. అంతే.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
తొలుత మై విలేజ్ షోతో గంగవ్వ ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. అనంతరం పలు సినిమాల్లో సైతం ఆమె నటించి.. ప్రేక్షకులను మెప్పించింది. అలా బిగ్ బాస్ 4 హౌస్‌లో గంగవ్వ అడుగు పెట్టారు. అయితే హౌస్‌లో ఏసీ పడకపోవడంతోపాటు.. సమయం సందర్బం లేకుండా టాస్క్ ఇస్తుండడంతో ఆమె తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దీంతో బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన కొద్ది రోజులకే గంగవ్వ బయటకు వచ్చేశారు.
Also Read: Bengaluru: కూలిన భవనం.. ఒకరు మృతి.. శిథిలాల కింద కార్మికులు
అయితే ప్రస్తుతం బిగ్ బాస్ 8 సీజన్ నడుస్తుంది. ఇందులో వైల్డ్ కార్డు ఎంట్రీతో గంగవ్వ మరోసారి ఈ హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఆ వెంటనే హౌస్‌లో అవినాష్‌తో కలిసి గంగవ్వ ఓ గేమ్ అద్బుతంగా ఆడి.. అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. అలాంటి వేళ గంగవ్వకు హార్ట్ అటాక్ వచ్చిందంటూ ఓ న్యూస్ అయితే సోషల్ మీడియాను చుట్టేస్తుంది. ఆమెకు హార్ట్ అటాక్ రావడంతో బిగ్ బాస్ హౌస్ నిర్వాహాకులు సైతం తీవ్ర ఆందోళన చెందారనే ఓ ప్రచారం సైతం సాగుతుంది.
Also Read: Ramcharan: ఆర్టీవో కార్యాలయంలో మెగా పవర్ స్టార్ సందడి
Also Read: IRCTC: శబరిమల యాత్రకు ప్రత్యేక రైలు
ఇక గంగవ్వకు వైద్యం అందించేందుకు వైద్యులు సైతం బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించారంటూ ఓ చర్చ సాగుతుంది. దీంతో ఆమె అభిమానులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇదంతా ఫ్రాంక్ అని కొందరు పేర్కొంటున్నారు. బిగ్ బాస్ టాస్క్‌లో భాగంగా గంగవ్వ హార్ట్ అటాక్ వచ్చినట్లు తోటి కంటెస్టెంట్స్‌కి ఝలక్ ఇచ్చిందనే ఓ చర్చ సైతం సాగుతుంది.
For Telangana News And Telugu News..