Share News

Rajendra Nagar MLA: రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్..

ABN , Publish Date - Jul 11 , 2024 | 06:35 PM

బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలస జోరు కొనసాగుతుంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్.. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ చేరనున్నారు. ఆయనతోపాటు ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు సైతం పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.

Rajendra Nagar MLA: రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్..

హైదరాబాద్, జులై 11: బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలస జోరు కొనసాగుతుంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్.. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ చేరనున్నారు. ఆయనతోపాటు ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు సైతం పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ప్రకాశ్ గౌడ్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచరం. ఈ వార్తలు వైరల్ కావడంతో.. బీఆర్ఎస్ అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది. ఆ క్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ప్రకాష్‌ గౌడ్ మనసు మార్చుకున్నట్లు చర్చ సైతం సాగింది.

Also Read: Uttarakhand:బద్రీనాథ్ జాతీయ రహదారిపై రాకపోకలు పునరుద్ధరణ


దీంతో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్.. కాంగ్రెస్ పార్టీలో చేరికను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆయన అనుచరగణంలో ఓ చర్చ సాగింది. అదీకాక.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రకాశ్ గౌడ్ మిత్రుడు అనే సంగతి అందరికీ తెలిసిందే. గతంలో వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో కలిసి పని చేశారు. 2009, 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా ప్రకాశ్ గౌడ్ గెలుపొందారు. అయితే 2014 ఎన్నికలనంతరం ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Also Read: IAS officer: పూజా కేడ్కర్ ‘డిమాండ్లు’.. వాట్సప్‌ చాట్ వైరల్

Also Read: Rahul Gandhi: ప్రధాని మోదీకి రాహుల్ వీడియో సందేశం..


బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆ పార్టీ వీడి... హస్తం పార్టీకి స్నేహ హస్తం అందిస్తున్నారు. అందులోభాగంగా ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సైతం మూడు రంగుల కండువా కప్పుకున్నారు. అలాగే గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతుడండంపై కారు పార్టీ అగ్రనాయకత్వం మండిపడుతుంది. ఆ క్రమంలో ఫిరాయింపులకు పాల్పడుతున్న వారిపై గులాబీ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిందే.. తాము చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మంత్రులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో పార్టీని విలీనం చేశామంటూ ఆయన సన్నాయి నొక్కులు నొక్కడం గమనార్హం.

Also Read: Peshawar: సౌదీ ఎయిర్‌లైన్స్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 11 , 2024 | 07:19 PM