Share News

CM Chandrababu: టీడీపీకి యువ రక్తం.. రెండు కీలక బాధ్యతలు ఉన్నాయన్న సీబీఎన్

ABN , Publish Date - Aug 25 , 2024 | 06:23 PM

తెలంగాణ తెలుగు దేశం పార్టీకి(TTDP) నూతన జవసత్వాలు అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు(CM Chandrababu) సిద్ధమయ్యారు.

CM Chandrababu: టీడీపీకి యువ రక్తం.. రెండు కీలక బాధ్యతలు ఉన్నాయన్న సీబీఎన్

హైదరాబాద్: తెలంగాణ తెలుగు దేశం పార్టీకి(TTDP) నూతన జవసత్వాలు అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు(CM Chandrababu) సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆయన యువ రక్తాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. పార్టీలో యువకులకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో బాబు.. టీటీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి టీడీపీ శ్రేణులు, అభిమానులు ఎన్టీఆర్ భవన్‌కి తరలివచ్చారు. ఈ సందర్భంగా బాబు.. రాష్ట్రంలో పార్టీ పటిష్టతపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని సూచించారు.

సమావేశం అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. "మీ అందరినీ కలవడానికి వచ్చాను. తెలుగు ప్రజలు 45 ఏళ్లగా నన్ను ఆశీర్వదిస్తూ వస్తున్నారు. టీడీపీని బలోపేతం చేశారు. అందుకుతగినట్లే పార్టీ నిరంతరం ప్రజలకు సేవ చేస్తోంది. ఈ కార్యక్రమంలో టీటీడీపీని బలోపేతం చేయాలని నిర్ణయించాం. హడ్‌హాక్ కమిటీలు రద్దు చేశాం. కొత్త కమిటీలు వేస్తాం. ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తాం. పార్టీలో యువ రక్తానికి అధిక ప్రాధాన్యం ఇస్తాం. వారిని ప్రోత్సహిస్తాం. నాపైన రెండు భాద్యతలు ఉన్నాయి. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం, రాక్షస పాలనను అంతమొందించి రాష్ట్రంలో సుభిక్ష పాలన సాగాలని నన్ను గెలిపించిన ఏపీ ప్రజలకు న్యాయం చేయడం. ఇకపై తెలంగాణకు ప్రతి 15 రోజులకొకసారి వస్తా. మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటా. అందరి నిర్ణయాల మేరకే పార్టీలో నిర్ణయాలుంటాయి" అని చంద్రబాబు స్పష్టం చేశారు


cbn.jpg

బాబుని కలిసిన బాబు మోహన్..

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కి సీఎం చంద్రబాబు వస్తున్నారని తెలుసుకున్న మాజీ మంత్రి బాబుమోహన్, ఆయన్ని కలిసేందుకు వచ్చారు. సీఎంను కలిశాక కాసేపు ముచ్చటించారు. అనంతరం తిరుగుపయనమయ్యారు. అయితే బాబు మోహన్ త్వరలో తెలంగాణ టీడీపీలో చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబుతో ఇదే అంశంపై మాట్లాడారని చెబుతున్నారు. కాగా, బాబు మోహన్ రాజకీయ జీవితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నుంచే ప్రారంభమైంది.

Updated Date - Aug 25 , 2024 | 06:27 PM