Share News

Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

ABN , Publish Date - Sep 29 , 2024 | 06:37 PM

భాగ్యనగరంలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతం అయింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌: భాగ్యనగరంలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతం అయింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, బండ్లగూడలో, గండిపేట, మణికొండ, నార్సింగి, కాటేదాన్‌ సహా పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. మరికాసేపట్లో నగరంలోని చాలా ప్రాంతాలకు వర్షం విస్తరిస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శేరిలింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్‌, హైటెక్ సిటీ, ఫిలిం నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఐటీ కారిడర్‌లో ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.


రెండ్రోజులూ..

రాష్ట్రంలో రాబోయే రెండురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక నుంచి గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు ఉన్న ద్రోణి.. తమిళనాడు మీదుగా రాయలసీమ వరకు విస్తరించి ఉందని తెలిపింది. ఈ క్రమంలో ఇవాళ పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, కరీంనగర్‌, నారాయణపేట, జోగులాంబ గద్వాల, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వివరించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

Congress: ప్రసంగిస్తూ స్పృహ కోల్పోయిన ఖర్గే.. మోదీని గద్దె దించే వరకు చనిపోనని శపథం

Telangana Tourism: తక్కువ బడ్జెట్‌తో వీకెండ్ ట్రిప్.. తెలంగాణ మినీ మాల్దీవులు బెస్ట్

ఈ వార్తలు కూడా చడవండి:

MLA RajaSingh: హత్యకు రెక్కీ.. స్పందించిన రాజా సింగ్

Ponnam: ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీ

Updated Date - Sep 29 , 2024 | 07:12 PM