Breaking: ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీ ఛార్జ్, ఇంటర్నెట్ సేవలు బంద్
ABN , Publish Date - Oct 19 , 2024 | 03:05 PM
సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయాన్ని ధ్వంసం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి.
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయాన్ని ధ్వంసం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. హిందూ సంఘాల కార్యకర్తలు పదుల సంఖ్యలో ఆలయ పరిసరాల్లోకి చేరుకుని నిరసనలు తెలిపారు. ఆలయం వెనుక ఉన్న మసీదు వైపు హిందూ సంఘాలు కదులుతుండగా.. మత ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉందనే భయాల నడుమ పోలీసులు లాఠీలు ఝుళిపించారు. లాఠీ ఛార్జ్ తో ఆందోళన మరింతగా పెరిగింది. పదుల సంఖ్యలో హిందూ కార్యకర్తలు గాయపడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ హిందూ ధార్మిక సంఘాల నేతలు భారీగా ఆలయ పరిసరాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.
హిందూ సంఘాల కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ర్యాలీని అడ్డుకున్న పోలీసులపైకి కార్యకర్తలు చెప్పులు, కుర్చీలు, వాటర్ ప్యాకెట్లు విసిరారు. పోలీసులు దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. తమను అడ్డుకుంటున్న పోలీసులపైకి కొందరు చెప్పులు విసురుతున్నారు. లాఠీ ఛార్జ్‌లో పలువురి తలలకు తీవ్రంగా గాయాలయ్యాయి. లాఠీ ఛార్జ్‌లో ఎడమ చెయ్యి విరిగి దుర్గ అనే యువకుడు కుప్పకూలాడు.
విషయం తెలుసుకున్న డీసీపీ రష్మీ పెరుమాల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న హిందూ కార్యకర్తలకు నచ్చజెబుతున్నారు. పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నేతలు, కార్యకర్తలు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు మతఘర్షణలు చెలరేగకుండా సికింద్రాబాద్ పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు సమాచారం.
Secunderabad: నిర్మానుష్యంగా సికింద్రాబాద్.. కొనసాగుతున్న బంద్
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: గబ్బు రేపుతున్న హైదరాబాద్ పబ్బులు..
TG News: ముగ్గురు యువకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు చూస్తే..
TG News: ప్రేమించిన యువతి దూరం పెట్టడంతో సహించలేని ఓ యువకుడు ఏం చేశాడంటే