Share News

JNTU: జేఎన్‏టీయూలో ఈవెనింగ్‌ బీటెక్‌..

ABN , Publish Date - Jul 27 , 2024 | 10:54 AM

వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం సాయంకాలం(ఈవెనింగ్‌) బీటెక్‌ (పార్ట్‌టైమ్‌) ప్రోగ్రామ్‌ నిర్వహించేందుకు జేఎన్‌టీయూ(JNTU) సన్నద్ధమైంది. ఈ విద్యా సంవత్సరం (2024-25)లోనే ప్రవేశాలు కల్పించేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు మార్గదర్శకాలను సిద్ధం చేశారు. నాలుగైదురోజుల్లో నోటిఫికేషన్‌(Notification) విడుదల చేసి, ఆగస్టు 15లోపు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తిచే యాలని భావిస్తున్నారు.

JNTU: జేఎన్‏టీయూలో ఈవెనింగ్‌ బీటెక్‌..

- మార్గదర్శకాలు రూపొందించిన ఉన్నతాధికారులు

- నెలాఖరుకు నోటిఫికేషన్‌, పంద్రాగస్టులోపు అడ్మిషన్లు

- మూడు కోర్సులు, ఒక్కో బ్రాంచీలో 30 సీట్లు

హైదరాబాద్‌ సిటీ: వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం సాయంకాలం(ఈవెనింగ్‌) బీటెక్‌ (పార్ట్‌టైమ్‌) ప్రోగ్రామ్‌ నిర్వహించేందుకు జేఎన్‌టీయూ(JNTU) సన్నద్ధమైంది. ఈ విద్యా సంవత్సరం (2024-25)లోనే ప్రవేశాలు కల్పించేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు మార్గదర్శకాలను సిద్ధం చేశారు. నాలుగైదురోజుల్లో నోటిఫికేషన్‌(Notification) విడుదల చేసి, ఆగస్టు 15లోపు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తిచే యాలని భావిస్తున్నారు. అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) మార్గదర్శకాల మేరకు ఈవెనింగ్‌ బీటెక్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించేందుకు ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ నోటిఫికేషన్‌ ఇవ్వగా, తాజాగా జేఎన్‌టీయూ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

ఇదికూడా చదవండి: Hyderabad: వారిని బదిలీ చేసినా వెళ్లరట!


మూడు కోర్సుల్లో 90 మందికి ప్రవేశాలు

ఈ విద్యా సంవత్సరంలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌(B.Tech Computer Science and Engineering), మెకానికల్‌, మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ఒక్కో బ్రాంచ్‌కు 30 సీట్ల చొప్పున 90 మందికి అడ్మిషన్లు కల్పించనున్నారు. పార్ట్‌టైమ్‌ బీటెక్‌లో ప్రవేశం కోరుకునే వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కనీసం ఏడాది పనిచేసి ఉండాలి. మూడేళ్ల డిప్లొమా ఇన్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ వారి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కొనసాగిస్తూనే రెగ్యులర్‌ బీటెక్‌ మాదిరి పార్ట్‌టైమ్‌ బీటెక్‌లో చేరి కనీసం మూడేళ్లలో పూర్తి చేసుకోవచ్చు.


city3.2.jpg

రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఇందులో ప్రవేశాలు ఉంటాయి. ఈ ఏడాదికి ఈసెట్‌ ఉత్తీర్ణత/ డిప్లొమా మెరిట్‌ ఆధారంగా అడ్మిషన్‌ కల్పించనున్నారు. కాగా, బీటెక్‌ రెగ్యులర్‌ అభ్యర్థుల మాదిరిగానే పార్ట్‌టైమ్‌ అభ్యర్థులకూ అన్ని పరీక్షలు ఉంటాయని, వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు తరగతులు నిర్వహిస్తామని వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నర్సింహారెడ్డి తెలిపారు.


ఇదికూడా చదవండి: సాగర్‌ నీటి విడుదలకు మా సమ్మతి అక్కర్లేదా?

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 27 , 2024 | 10:54 AM