Share News

K. Narayana: హైడ్రా కూల్చివేతలు.. పులి మీద స్వారీనే

ABN , Publish Date - Aug 27 , 2024 | 03:44 AM

హైడ్రా పేరుతో అక్రమ కట్టడాల కూల్చివేత పులి మీద స్వారీ లాంటిందని.. సీఎం రేవంత్‌ రెడ్డి భయపడి పులి మీద నుంచి దిగితే.. అది ఆయన్ను తినేస్తుందని..

K. Narayana: హైడ్రా కూల్చివేతలు.. పులి మీద స్వారీనే

  • రేవంత్‌ పులి దిగితే.. అది ఆయన్ను తినేస్తుంది: నారాయణ

హైదరాబాద్‌, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): హైడ్రా పేరుతో అక్రమ కట్టడాల కూల్చివేత పులి మీద స్వారీ లాంటిందని.. సీఎం రేవంత్‌ రెడ్డి భయపడి పులి మీద నుంచి దిగితే.. అది ఆయన్ను తినేస్తుందని.. అలాగే ముందుకెళితే ప్రజల మద్దతు ఉంటుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో నారాయణ మీడియాతో మాట్లాడారు.


ప్రభుత్వ కార్యాలయాలను కూల్చుతారా..? అని ఎంఐఎం నేత ప్రశ్నించడాన్ని నారాయణ తప్పు పట్టారు. ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించే ప్రభుత్వ కార్యాలయాలకు.. కబ్జాదారుల ఫాం హౌస్‌లు, ఫంక్షన్‌ హాళ్లు, విద్యా సంస్థలకు ఎలా ముడిపెడతారని ప్రశ్నించారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా సెప్టెంబరు 1 నుంచి 7 వరకు దేశ వ్యాప్తంగా నిరసనలు చేపడతామని నారాయణ ప్రకటించారు.

Updated Date - Aug 27 , 2024 | 03:44 AM