Share News

Ram Navami 2024 Live: వైభవంగా శ్రీసీతారాముల కళ్యాణం.. భద్రాచలం నుంచి లైవ్ మీకోసం..

ABN , Publish Date - Apr 17 , 2024 | 09:38 AM

Bhadrachalam Ram Navami LIVE: భద్రాచల క్షేత్రంలో(Bhadrachalam) మహా కమనీయ ఘట్టం.. రాములోరు, సీతమ్మ కళ్యాణమే! ఆ శుభ ముహూర్తం వచ్చేసింది. ఇవాళే సీతారాముల కళ్యాణం(Seetharamula Kalyanam)! శీరామ నవమి(Ram Navaami 2024) సందర్భంగా ఈ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలానికి చేరుకున్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ఉండటంతో కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) భద్రాచలం వెళ్లడం..

Ram Navami 2024 Live: వైభవంగా శ్రీసీతారాముల కళ్యాణం.. భద్రాచలం నుంచి లైవ్ మీకోసం..
Bhadrachalam Ram Navami

Bhadrachalam Ram Navami LIVE: భద్రాచల క్షేత్రంలో(Bhadrachalam) మహా కమనీయ ఘట్టం.. రాములోరు, సీతమ్మ కళ్యాణమే! ఆ శుభ ముహూర్తం వచ్చేసింది. ఇవాళే సీతారాముల కళ్యాణం(Seetharamula Kalyanam)! శీరామ నవమి(Ram Navaami 2024) సందర్భంగా ఈ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలానికి చేరుకున్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ఉండటంతో కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) భద్రాచలం వెళ్లడం లేదు. కళ్యాణం సందర్భంగా స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్‌ శాంతికుమారి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. కళ్యాణ వేడుక జరిగే మిథిలా స్టేడియంలో శిల్పకళాశోభితమైన మండపాన్ని చక్కగా అలంకరించారు.


ఎండలు, ఉక్కబోతతో భక్తులు ఇబ్బందులు పడకుండా స్టేడియంలో 50 టన్నుల ఏసీతో పాటు, వంద కూలర్లు, 270 ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు తిరుకల్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం అభిజిత్‌ లగ్నంలో కల్యాణం నిర్వహిస్తారు. కల్యాణ వేడుకలో భాగంగా మంగళవారం రాత్రి ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా సాగింది. ప్రభుత్వం తరఫున స్వామి వారికి శాంతి కుమారి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. దేవాదాయ శాఖ తరఫున ముఖ్యకార్యదర్శి శైలజరామయ్యర్‌ పట్టువస్త్రాలు అందజేశారు. కల్యాణ మహోత్సవం సందర్భంగా భక్తుల కోసం 2.50 లక్షల లడ్డూలను దేవస్థానం అధికారులు సిద్ధం చేశారు. వీటిని 19 ప్రసాద విక్రయ కౌంటర్ల ద్వారా వీటిని విక్రయించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 17 , 2024 | 09:44 AM