Home » Bhadradri Kothagudem
ఓ యువకుడు, యువతి ప్రేమ.. సహజీవనంతో మొదలైన కథ.. కక్షలతో మలుపులు తిరిగింది. ఒక మహిళపై హత్యాయత్నానికి, మరో జంట ఆత్మహత్యకు, చివరికి ఆ యువతి హత్యకు దారితీసింది.
మాతా, శిశు మరణాల రేటు శాతం తగ్గించడానికి భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లీడర్షిప్ ట్రైనింగ్‌కు భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాకు చెందిన నర్సింగ్ ఆఫీసర్ సుర్నపు స్వప్న ఎంపికైంది. ప్రపంచంలోనే టెక్నాలజీలకు నిలయం, మాతా శిశు మర ణాల రేటు శాతం లేని దేశంగా పేరు ప్రఖ్యాతలు గడిచిన జపాన్ ఈ శిక్షణ కేంద్రానికి వేదిక కానుంది.
మాతా, శిశు మరణాల రేటు శాతం తగ్గించడానికి భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లీడర్షిప్ శిక్షణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్) పరిధిలోని రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్) నర్సింగ్ అధికారి సూర్నపు స్వప్న ఎంపికయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సహజ, సేంద్రియ వ్యవసాయానికి ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)’ ఏర్పాటుకు రూ.10 కోట్లు మంజూరు చేయాలన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తికి ఆమోదం తెలిపింది.
ఒకప్పుడు అధికారులు చెప్పిన పనులు చేయడం ఆయన విధి. రోజు వారి కూలీగా పనిచేసే ఆఫీసు బాయ్ ఆయన నేడు ఆరు మండలాలకు ఓ బాధ్యత గల ఉన్నతాధికారిగా ఎదిగాడు. ఆయనే మణుగూరు అసిస్టెంట్ లేబర్ అధికారి బండి నాగరాజు(Bandi Nagaraju).
విద్యుత్ చౌర్యం ఘటనలో కేసు లేకుండా చేసేందుకు ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లైన్ఇన్స్పెక్టర్ జిలుగు నాగరాజు ఏసీబీకి చిక్కాడు.
పినపాక ఏజెన్సీ ప్రాంతంలో పోస్ట్ వైరల్ ఫీవర్స్(Post viral fever) ప్రజలను వణికిస్తున్నాయి. మణుగూరు, పినపాక, అశ్వాపురం, కరకగూడెం తదితర మండలాల్లో కొత్తగా వస్తున్న జ్వరాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. 12న విజయదశమి సందర్భంగా భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేకం, విజయోత్సవం, ఆయుధపూజ, శ్రీరామ్‌లీలా మహోత్సవం నిర్వహించనున్నారు. అక్టోబర్ 17న శబరి స్మృతియాత్ర సైతం నిర్వహించనున్నారు.
చర్ల అటవీ ప్రాంతంలో కెమెరా, జీపీఎస్ ట్రాకర్ అమర్చిన ‘గూఢచార రాబందు’ సంచారం కలకలం సృష్టించింది.
ఆపరేషన్ కగార్‌లో భాగంగా భారీగా కూంబింగ్ సాగుతున్నా.. పూసుగుప్ప క్యాంప్‌పై మావోయిస్టుల దాడితో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. సుమారు అరగంట పాటు మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అయితే ప్రాణ నష్టంపై పోలీస్ అధికారులు, మావోయిస్ట్ పార్టీ ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదు.