Share News

Maternal health: జపాన్‌లో లీడర్‌షిప్‌ శిక్షణకు ఎంపికైన రామవరం ఎంసీహెచ్‌ నర్సింగ్‌ అధికారి స్వప్న

ABN , Publish Date - Nov 09 , 2024 | 03:33 AM

మాతా, శిశు మరణాల రేటు శాతం తగ్గించడానికి భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లీడర్‌షిప్‌ శిక్షణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్‌) పరిధిలోని రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్‌) నర్సింగ్‌ అధికారి సూర్నపు స్వప్న ఎంపికయ్యారు.

Maternal health: జపాన్‌లో లీడర్‌షిప్‌ శిక్షణకు ఎంపికైన రామవరం ఎంసీహెచ్‌ నర్సింగ్‌ అధికారి స్వప్న

చుంచుపల్లి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): మాతా, శిశు మరణాల రేటు శాతం తగ్గించడానికి భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లీడర్‌షిప్‌ శిక్షణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్‌) పరిధిలోని రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్‌) నర్సింగ్‌ అధికారి సూర్నపు స్వప్న ఎంపికయ్యారు. ప్రపంచంలోనే టెక్నాలజీకి నిలయంగా, మాతాశిశు మర ణాలు లేని దేశంగా పేరు ప్రఖ్యాతలు గడించిన జపాన్‌ వేదికగా ఈనెల 12 నుంచి 24వ తేదీ వరకు ఆ శిక్షణ కొనసాగనుంది. మాతాశిశు ఆరోగ్య సంరక్షణ కోసం జపాన్‌ చేపట్టిన విధి, విధానాలు, కారాచరణ, నియమాలను తెలుసుకునేందుకు భారత్‌ నుంచి ఏడుగురు సభ్యుల బృందం అక్కడికి వెళ్లనుంది.


రాష్ట్రం నుంచి నైపుణ్యం, అనుభవం కలిగిన నర్సింగ్‌ అధికారులను పంపించాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర కుటుంబ, సంక్షేమ శాఖ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌.. భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో పనిచేస్తున్న స్వప్నతో పాటు వరంగల్‌ జిల్లాలో పనిచేస్తున్న మరో నర్సింగ్‌ అధికారి పేరును ప్రతిపాదించగా, జపాన్‌ శిక్షణాకేంద్రం ప్రతినిధులు శుక్రవారం వారి పేర్లను ఖరారు చేశారు.

Updated Date - Nov 09 , 2024 | 03:33 AM