Mulugu Dist.,: రామప్ప ఆలయ పరిసరాలల్లో గుప్తనిధుల కోసం వేట
ABN , Publish Date - Sep 23 , 2024 | 08:07 AM
ములుగు జిల్లా: గొల్లాల గుడిలో గుప్తనిధుల తవ్వకాలు జరిగినట్లు ఆదివారం వెలుగులోకి వచ్చింది. గుడి పైకప్పు తొలగించడంతో శిఖరం దెబ్బతింది. పైకప్పులో వికసించే తామరపువ్వు గుర్తుతో ఉన్న శిల్పాన్ని దుండగులు పూర్తిగా ధ్వంసం చేసి ఆలయ పరిసరాల్లో పడేశారు. శివలింగం ఒకవైపు ఒరిగినట్లు కనిపిస్తోంది.
ములుగు జిల్లా: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన.. యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయ (Ramappa Temple) పరిసరాలల్లో గుప్తనిధుల కోసం (Hidden treasures) గుర్తుతెలియని దుండగులు (Thugs)తవ్వకాలు జరిపారు. గొల్లాలగుడి ఆలయ పైకప్పు పగలగొట్టి దుండగులు లోపలికి చొరబడ్డారు. గుడిలోని శివలింగాన్ని పెకిలించారు. ఇది గమనించిన స్థానికులు గుప్తనిధుల తవ్వకాలపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రామప్ప టెంపుల్ దగ్గర భద్రత లేకపోవడంతోనే దుండగులు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపించారు.
కాగా గొల్లాల గుడిలో గుప్తనిధుల తవ్వకాలు జరిగినట్లు ఆదివారం వెలుగులోకి వచ్చింది. గుడి పైకప్పు తొలగించడంతో శిఖరం దెబ్బతింది. పైకప్పులో వికసించే తామరపువ్వు గుర్తుతో ఉన్న శిల్పాన్ని దుండగులు పూర్తిగా ధ్వంసం చేసి ఆలయ పరిసరాల్లో పడేశారు. శివలింగం ఒకవైపు ఒరిగినట్లు కనిపిస్తోంది. సుమారు వారం రోజుల క్రితం తవ్వకాలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం సాయంత్రం అటువైపు వెళ్లిన పురావస్తు శాఖ సిబ్బంది గమనించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. సాయంత్రం 7 గంటల సమయంలో వెంకటాపూర్ పోలీసు స్టేషన్‌లో పురావస్తు శాఖ సిబ్బంది ఫిర్యాదు చేసినట్లు స్థానిక ఎస్‌ఐ తెలిపారు.
కాగా కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ ఆదివారం రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కేంద్రమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పూజారులు కురియన్‌ను తీర్థ ప్రసాదాలు ఇచ్చి సత్కరించారు. రామప్ప శిల్ప కళా సంపద గురించి పర్యాటక సిబ్బంది వివరించారు. ఆలయ పరిసరాల్లో బీజేపీ జిల్లా నాయకులతో కలిసి ఆయన కలియతిరిగారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక బీజేపీ నేతలు ఉన్నారు.
అంతకుముుందు రోజు శనివారం హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారత దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచ దేశాల్లో అతి పెద్ద శక్తిగా రూపు దిద్దుకుందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు. దేశంలోని యువత బీజేపీ వెంట ఉందని తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మెంబెర్ షిప్ చేయడం లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన మహా శాంతి యాగం..
లడ్డూ అపచారంపై సిట్ దర్యాప్తు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News