Home » Khammam
ఆహార తనిఖీ విభాగం రాష్ట్ర అధికారులు సోమవారం ఖమ్మంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఖమ్మం జిల్లా అధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా పలు ఆహార తయారీ కేంద్రాలు, స్వీట్స్ దుకాణాలు, పిండి వంటల కేంద్రాల్లో తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు.
ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థిని ర్యాగింగ్ చేసి గుండు కొట్టించిన ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖమ్మం మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు చేస్తుండగా ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిపై పోలీసులకు అనుమానం వచ్చింది. వారిని ఆపి ప్రశ్నించే లోపే పోలీసులను చూసి ఇద్దరూ పారిపోయే ప్రయత్నం చేశారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మెుదటి సంవత్సరం విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనపై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
అమెరికాలోని ఓహియో రాష్ట్ర గవర్నర్ సలహాదారుగా తెలుగు మహిళ రామసహాయం రాధిక నియమితులయ్యారు. ఖమ్మం నగరానికి చెందిన బుచ్చిరెడ్డి- నిర్మల దంపతుల పెద్ద కుమార్తె రాధిక 2006లో గద్వాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
ఎమ్మెల్యేలు, ఎంపీల పదవీకాలం ముగిసిన తర్వాత ప్రభుత్వాలు వారికి కల్పిస్తున్నట్లే స్థానిక ప్రజాప్రతినిధులకు పింఛన్ సౌకర్యాన్ని కల్పించాలని జాతీయ పంచాయతీరాజ్ చాంబర్ రెండు రాష్ట్రాల సంయుక్త సమావేశం డిమాండ్ చేసింది.
ఖమ్మం జిల్లాలో హిందీ ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ప్రదానోపాధ్యాయులు(హెచ్ఎం)పై సస్పెన్షన్ వేటు పడింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేతో ప్రజలకు ఏమేం అవసరాలు ఉన్నాయో ప్రభుత్వానికి తెలుస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.
వంటనూనెల ధరలు మంటలు మండి పోతున్నాయి. రోజు రోజుకు ధరలు పెరుగుతూ వినియోగదారులకు దడ పుట్టిస్తున్నాయి. పండుగలు, శుభకార్యాల వేళ వంట నూనెల ధరలకు రెక్కలు రావడంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. గత నెల క్రితం లీటరు పామాయిల్ రూ.90లు నుంచి రూ.95లకు, సన్‌ప్లవర్ ఆయిల్(Sunflower oil) రూ. 110-115 లకు ఉండగా ప్రసుత్తం పామాయిల్ రిటైల్ మార్కెట్లో లీటర్ రూ. 135లకు, సన్‌ప్లవర్ రూ.145 లకు చేరింది.
ఒకప్పుడు అధికారులు చెప్పిన పనులు చేయడం ఆయన విధి. రోజు వారి కూలీగా పనిచేసే ఆఫీసు బాయ్ ఆయన నేడు ఆరు మండలాలకు ఓ బాధ్యత గల ఉన్నతాధికారిగా ఎదిగాడు. ఆయనే మణుగూరు అసిస్టెంట్ లేబర్ అధికారి బండి నాగరాజు(Bandi Nagaraju).