Share News

Crime: ఆత్మహత్యాయత్నం చేసిన ఎస్ఐ.. చికిత్స పొందుతూ మృతి..

ABN , Publish Date - Jul 07 , 2024 | 10:02 AM

హైదరాబాద్: వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ మృతి చెందారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట ఎస్ఐగా విధులు నిర్వహిన్నారు.

Crime: ఆత్మహత్యాయత్నం చేసిన ఎస్ఐ.. చికిత్స పొందుతూ మృతి..

హైదరాబాద్: వారం రోజుల క్రితం పురుగుల మందు (Pesticide) తాగి ఆత్మహత్యాయత్నం (Suicide Attempt) చేసిన ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ (SI Sriramula Srinivas) మృతి (Died) చెందారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట (Aswaraopeta) ఎస్ఐగా విధులు నిర్వహిన్నారు. జూన్ 30న మహబూబాబాద్‌లో పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అయితే ఆదివారం తెల్లవారు జామున ఆయన మరణించారు.


సీఐ, కానిస్టేబుళ్ల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ వాంగ్మూలం ఇచ్చారు. దీని ఆధారంగా ఆయన భార్య కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పటికే సీఐ సహా కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీఐ జితేందర్‌ను ఐజీ కార్యాలయానికి, నలుగురు కానిస్టేబుళ్లను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేసి, శాఖాపరమైన చర్యలు చేపట్టారు. ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ మృతి పోలీస్ శాఖలో కలకలంగా మారింది.


ఉన్నతాధికారుల వేధింపులు భరించలేనంటూ శ్రీరాముల శ్రీనివాస్ గత ఆదివారం తన సర్వీస్ రివాల్వార్, సెల్ ఫోన్ సరెండర్ చేసి, ఎవరికీ చెప్పకుండా మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వారం రోజులుగా మృత్యువుతో పోరాడి ఆదివారం తెల్లవారు జామున యశోద ఆస్పత్రిలో మృతిచెందారు. అధికారుల వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు తన వాంగ్మూలంలో శ్రీరాముల శ్రీనివాస్ పేర్కొన్నారు. అధికారుల వేధింపులకు సంబంధించి ఫోన్లో అన్ని రికార్డ్ చేసినట్లు తెలిపారు. డయింగ్ డిక్లరేషన్‌లో అధికారుల వేధింపులకు సంబంధించి స్టేట్‌మెంట్ ఇచ్చారు.


కాగా అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం వ్యవహారం ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. ఉన్నతాధికారుల వేధింపులతో ఒక ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడటం అటు పోలీస్ వర్గాలతో పాటు ఇటు సాధారణ ప్రజానీకాన్ని సయితం ఆలోచనలో పడేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తండ్రి బాటలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి

తాడేపల్లి ప్యాలెస్ ప్రహరీ గోడ ఖర్చు 10 కోట్లు..!

Jagan : చంద్రబాబూ.. హెచ్చరిస్తున్నా!

RK Kothapaluku : నవ్విపోదురుగాక..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 07 , 2024 | 10:02 AM