KTR : రాష్ట్రంలో డిజిటల్ విధ్వంసం
ABN , Publish Date - Jul 03 , 2024 | 02:49 AM
తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో జరుగుతున్న డిజిటల్ విధ్వంసంపై దృష్టి సారించాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎ్‌స)ని కోరారు..
సీఎస్ చర్యలు తీసుకోవాలని
కోరిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో జరుగుతున్న డిజిటల్ విధ్వంసంపై దృష్టి సారించాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎ్‌స)ని కోరారు ఈ మేరకు మంగళవారం ఆయన ఎక్స్(ట్విటర్)లో ఓ పోస్టు చేశారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లోని ముఖ్యమైన సమాచారాన్ని కనిపించకుండా చేశారని, కొన్ని వెబ్సైట్లను పూర్తిగా తొలగించారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే డిజిటల్ విధ్వంసం జరుగుతుందనే భావన కలుగుతోందని ఆరోపించారు. ముఖ్యమైన సమాచారాన్ని ఆర్కైవ్స్‌లో భద్రపరచాలని, ఇలా తొలగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ డిజిటల్ విధ్వంసంపై సమగ్ర వివరాలను పంపిస్తానని, సమాచార భద్రతకు సీఎస్ తగు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు.