Shamsabad : జర్మనీకి వెళ్లాల్సిన లుఫ్తాన్సా విమానం రద్దు
ABN , Publish Date - Oct 03 , 2024 | 04:57 AM
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జర్మనీకి వెళ్లాల్సిన లుఫ్తాన్సా విమానం రద్దయ్యింది.
ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో నిర్ణయం
శంషాబాద్, అక్టోబరు 2: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జర్మనీకి వెళ్లాల్సిన లుఫ్తాన్సా విమానం రద్దయ్యింది. మంగళవారం అర్ధరాత్రి జర్మనీ నుంచి రావాల్సిన విమానం శంషాబాద్‌కు రాకపోవడంతో ఈ విమాన సర్వీసు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్‌లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆ దేశ గగనతలం నుంచి వెళ్లే ఈ విమానాన్ని రద్దు చేసినట్లు లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ పేర్కొంది.
జర్మనీకి వెళ్లడానికి హైదరాబాద్ నుంచి 130 మంది టికెట్ బుక్ చేసుకున్నారు. విమానం రద్దు అయ్యిందని తెలుసుకున్న కొందరు ఎయిర్‌పోర్టుకు రాలేదు. వచ్చిన వారిలో కొందరిని ఇతర విమాన సర్వీసుల ద్వారా జర్మనీకి తరలించామని, మిగిలిన వారికి హోటల్లో బస ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.