Share News

వాహనాల తనిఖీలో రూ.2 లక్షలు సీజ్‌

ABN , Publish Date - May 06 , 2024 | 11:28 PM

గజ్వేల్‌, మే 6: గజ్వేల్‌ మండల పరిధిలోని మక్తమాసాన్‌పల్లి చౌరస్తా వద్ద గల బేగంపేట పోలీ్‌సస్టేషన్‌ ఎదుట గల చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు.

వాహనాల తనిఖీలో రూ.2 లక్షలు సీజ్‌
గజ్వేల్‌లో రూ.2 లక్షలను సీజ్‌ చేస్తున్న పోలీసులు

గజ్వేల్‌, మే 6: గజ్వేల్‌ మండల పరిధిలోని మక్తమాసాన్‌పల్లి చౌరస్తా వద్ద గల బేగంపేట పోలీ్‌సస్టేషన్‌ ఎదుట గల చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. తొగుట సీఐ లతీఫ్‌, స్టాటిస్టికల్‌ సర్వేలైన్స్‌ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టగా గజ్వేల్‌ పట్టణానికి చెందిన ఎస్‌.శ్రీనివాస్‌ తన కారులో ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.2 లక్షలను సీజ్‌ చేసినట్లు తెలిపారు. గజ్వేల్‌ పట్టణంలోని జగదేవ్‌పూర్‌ రోడ్డులో అదనపు ఇన్‌స్పెక్టర్‌ ముత్యంరాజు తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. బూరం మల్లేశం తన వాహనంలో తీసుకెళ్తున్న రూ.55,000, లాల్‌గడి మలక్‌పేటకు చెందిన శిలాసాగర్‌ సిద్ధులు తీసుకెళ్తున్న రూ.68,500 నగదును సీజ్‌ చేశారు.

టేక్మాల్‌లో రూ.1,21,700 లక్షలు..

టేక్మాల్‌, మే 6: టేక్మాల్‌ మండల పరిధిలోని పల్వంచ శివారులో ఏర్పాటుచేసిన బీజేపీ ఆఫీస్‌ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. సంగారెడ్డికి చెందిన అడ్వకేట్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏ.విష్ణువర్ధన్‌రెడ్డి వద్ద రూ.71,500 వేలు, అలాగే అతని డ్రైవర్‌ ఫారిద్‌ వద్ద రూ.50,200 వేల నగదు పట్టుబడిందని ఎస్‌ఐ మురళి తెలిపారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్‌చేసి, వారికి రసీదు అందజేశారు.

చిన్నకోడూరులో రూ.1,11,400 లక్షలు..

చిన్నకోడూరు, మే 6: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో చిన్నకోడూరు మండలం అనంతసాగర్‌లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద సోమవారం రాత్రి ఎస్‌ఎ్‌సటీ టీం, పోలీసులు కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో కొండపాక మండలం ఎర్రవల్లికి చెందిన సుంచు రాజు కారులో కరీంనగర్‌ నుంచి సిద్దిపేటకు ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1,11,400 నగదును స్వాధీనం చేసుకున్నట్లు చిన్నకోడూరు ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు. సిద్దిపేట రూరల్‌ సీఐ శ్రీను, బెజ్జంకి ఎస్‌ఐ కృష్ణారెడ్డి ఉన్నారు.

Updated Date - May 06 , 2024 | 11:28 PM