Share News

మెదక్‌ కోసం యుద్ధం చేద్దామా!

ABN , Publish Date - May 08 , 2024 | 12:47 AM

ముఖ్యమంత్రి కొత్త జిల్లాలను తీసేస్తానని అంటున్నాడని, మెదక్‌ జిల్లానూ తీసేస్తారని మాజీ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మెదక్‌ జిల్లా ఉండాలంటే బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ అఽభ్యర్థి వెంట్రామారెడ్డిని గెలిపించాలి.. మెదక్‌ కోసం యుద్దం చేద్దామా..? అని ప్రజలను ప్రశ్నించగా.. చేద్దామని జనం నినదించారు.

మెదక్‌ కోసం  యుద్ధం చేద్దామా!

ప్రజల కోసమే జిల్లాను ఏర్పాటు చేశాం

కాంగ్రెస్‌ వాళ్లు వద్దంటున్నరు

మీ కోసమే వెంకట్రాంరెడ్డిని పోటీ చేయమన్నా

మెదక్‌ మున్సిపాలిటీ, మే 7: ముఖ్యమంత్రి కొత్త జిల్లాలను తీసేస్తానని అంటున్నాడని, మెదక్‌ జిల్లానూ తీసేస్తారని మాజీ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మెదక్‌ జిల్లా ఉండాలంటే బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ అఽభ్యర్థి వెంట్రామారెడ్డిని గెలిపించాలి.. మెదక్‌ కోసం యుద్దం చేద్దామా..? అని ప్రజలను ప్రశ్నించగా.. చేద్దామని జనం నినదించారు. మెదక్‌ రాందాస్‌ చౌరస్తాలో మంగళవారం రాత్రి నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. విద్యావంతుడు, మెదక్‌పై ప్రేమ ఉన్నవాడు.. నా సలహాతోనే మాజీ కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యం కోసం తాము కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి రద్దు చేస్తడంట అని కేసీఆర్‌ పేర్కొన్నారు. మెదక్‌ జిల్లా ఉండాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మెదక్‌ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించామని తెలిపారు. మెదక్‌ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, ఏడుపాయలకు రూ.100 కోట్లు కేటాయిస్తూ జీవోను ఇస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. మెదక్‌ పట్టణంలోని 100 పడకల ఆస్పత్రిని 50 పడకలకు కుదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హల్దీవాగు మీద చెక్‌డ్యాంలు నిర్మించి మల్లన్నసాగర్‌కు అనుసందానం చేయడంతో సింగూరు ప్రాజెక్టు కళలలాడుతున్నదని పేర్కొన్నారు.

హామీలు అమలు చేయలేని అసమర్థులు

కాగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయలేక అసమర్ధతను నిరూపించుకుందని మాజీ సీఎం అన్నారు. రూ.4వేల పెన్షన్‌, రూ.15వేల రైతుబంధు వస్తుందా అని ప్రజలను ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలతో అరచేతిలో వైకుంఠం చూపిందని మండిపడ్డారు. ఇష్టమొచ్చిన వాగ్దానాలిచ్చి రేవంత్‌ సర్కార్‌ ఏది నెరవేర్చలేదన్నారు. కరెంట్‌ కోతలు... నీళ్లు రావు.. రూ.500 బోనస్‌ లేదు.. మద్దతు ధర ఇవ్వలేదు.. తడిసిన ధాన్యం కొనడం లేదు.. ఏ ఒక్క పథకాన్ని అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఆగమాగం జగన్నాఽథంలా ఈ ప్రభుత్వ తీరు ఉందని ఎద్దేవా చేశారు.

జూటా బ్యాచ్‌కు బుద్ధి చెప్పాలి : హరీశ్‌రావు

మోసపూరిత వాగ్దానాలు చేసి.. ఎన్నికల తరువాత అమలు చేయని కాంగ్రెస్‌ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మెదక్‌ కార్నర్‌షోలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ జూటా బ్యాచ్‌కు గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. రూ. 4వేలు తీసుకుంటే కాంగ్రె్‌సకు ఓటు వేయాలని.. మహిళలకు రూ.2,500 ఇస్తే కాంగ్రెస్‌ ఓటేయండని.. లేదనంటే బీఆర్‌ఎ్‌సకు ఓటేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తరువాత లక్ష పెళ్లిల్లు జరిగాయని.. రేవంత్‌ సర్కార్‌ నూతన వధూవరులకు లక్ష తులాల బంగారం బాకీ పడిందని పేర్కొన్నారు. బీజేపీకి ఓటెస్తే నీళ్లు లేని బావిలో వేసినట్లేనని ఎద్దేవా చేశారు.

రూ.. 100 కోట్లతో ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తా..

తనను ఎంపీగా గె లిపిస్తే రూ. 100 కోట్లతో ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తానని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామారెడ్డి తెలిపారు. పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉచితంగా కల్యాణ వేదికలు నిర్మించి ఇస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుభా్‌షరెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలత, రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ మల్లిఖార్జున్‌గౌడ్‌, నాయకుడు బట్టి జగపతి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 12:47 AM