Share News

గత పాలకుల నిర్లక్ష్యంతోనే సమస్యలు

ABN , Publish Date - Jul 25 , 2024 | 11:03 PM

మెదక్‌ మున్సిపాలిటీ, జూలై 25: గత పాలకుల నిర్లక్ష్యంతోనే సమస్యలు తాండవిస్తున్నాయని.. ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చామని, త్వరలోనే మీ ఇబ్బందులు తీరుస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ అన్నారు.

గత పాలకుల నిర్లక్ష్యంతోనే సమస్యలు
ఆటోమెటిక్‌ క్లోరినేషన్‌ వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రోహిత్‌

మళ్లీ వచ్చేసరికి డబుల్‌బెడ్‌రూం, రోడ్లు వేయిస్తా

ఆటోమెటిక్‌ క్లోరినేషన్‌ ప్లాంట్‌ ప్రారంభంలో ఎమ్మెల్యే రోహిత్‌

మెదక్‌ మున్సిపాలిటీ, జూలై 25: గత పాలకుల నిర్లక్ష్యంతోనే సమస్యలు తాండవిస్తున్నాయని.. ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చామని, త్వరలోనే మీ ఇబ్బందులు తీరుస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ అన్నారు. పిల్లికొట్టాల్‌లోని డబుల్‌బెడ్‌రూం కాలనీలో అకామ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆటోమెటిక్‌ క్లోరినేషన్‌ ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ ప్లాంట్‌ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కాలనీలో రోడ్లు, ఇతర సమస్యలున్నాయని ప్రజలు తెలపగా.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేవలం కమీషన్ల కోసం ఇళ్లు నిర్మించి సమస్య తీర్చలేకపోయిందని మండిపడ్డారు. డబుల్‌బెడ్‌రూం కాలనీలో రోడ్లు తాను మళ్లీ వచ్చేలోగా పూర్తిచేయిస్తానని హామీనిచ్చారు. అంతేగాకుండా అర్హులైన వారికి ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్లు అందిస్తామన్నారు. ఓవైపు ఎమ్మెల్యే మాట్లాడుతుండగా తమతమ సమస్యలు తీర్చాలంటూ మహిళలు ఏకరువు పెట్టారు. విడతల వారీగా సమస్యలు పరిష్కరించే దిశగా తాను చర్యలు తీసుకోబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌, కమిషనర్‌ జానకీరాంసాగర్‌, కౌన్సిలర్లు, నాయకులు శేఖర్‌, దాయర రాజలింగం, లక్ష్మినారాయణగౌడ్‌, రాగి అశోక్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 25 , 2024 | 11:03 PM